తెలంగాణ

డిసెంబర్ 12న తెలంగాణలో కాంగ్రెస్ జయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, అక్టోబర్ 8: డిసెంబర్ 12న తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం రాత్రి నేరేడుచర్లలో జరిగిన నల్లగొండ జిల్లా నేరేడుచర్ల, పాలకీడు, గరిడేపల్లి మండలాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కోదాడ మాజీ శాసనసభ్యులు పద్మావతి, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతాయని 11న ఫలితాలు ప్రకటిస్తారని, 12న అత్యధిక స్ధానాలు గెలుచుకోని కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని దోచుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బొందపెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఓటు అడిగే అర్హత టీర్‌ఎస్‌కు లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన దళితులకు మూడెకరాల పంపిణీ, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు అమలు విస్మరించిందని ఆరోపించారు. రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో వందరోజుల్లో రైతులకు 2 లక్షల ఋణమాఫిని ఏకకాలంలో అమలుచేస్తామని వరికి 2వేల రూపాయలు, పత్తికి ఆరువేలు, మిర్చికి 10వేల రూపాయల మద్దతు ధర అమలుచేస్తామని, వెయ్యి రూపాయల పెన్షన్‌ను 2వేల రూపాయలకు పెంచుతామని అర్హులైన వారు ఉంటే కుటుంబంలో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్ అందజేస్తామన్నారు. లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు నెలకు 3 వేల రూపాయల భృతి అందజేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడు కిలోల సన్నబియ్యం, 9రకాల నిత్యావసర వస్తువులు, రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తామన్నారు. స్వంత స్ధలంలో ఇండ్లు నిర్మించుకుంటే 5 లక్షల రూపాయలు, దళిత గిరిజనులకు 6 లక్షల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే కన్పిస్తున్నాయని సబ్‌స్టేషన్లు, రహదారుల నిర్మాణం, సాగునీరు, తాగునీరు, తదితర వౌలిక సదుపాయలు కల్పించామని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొణతం చిన్నవెంకట్‌రెడ్డి, వజ్రపు చంద్రశేఖర్, కిసాన్‌సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొణతం వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..నేరేడుచర్లలో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న టీపీసీసీ అధ్యక్షులు ఉత్తంకుమార్‌రెడ్డి