తెలంగాణ

గొల్ల కుర్మల అభ్యున్నతికి విశేష కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, అక్టోబర్ 8: గొల్ల కుర్మల ఆర్థిక అభ్యున్నతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషంగా కృషి చేసారని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా యాదవుల కుల వృత్తులను గౌరవిస్తూ వారికి గొర్రె పిల్లలను సబ్సిడీపై పంపిణీ చేసిన ఘనత కేవలం ఆయనకే దక్కిందన్నారు. పట్టణ శివారులలోని జీఎంఆర్ ఫంక్షన్‌హాలులో సోమవారం జరిగిన గొల్లకుర్మల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేవలం నాలుగున్నర సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది అన్నారు. రాష్ట్భ్రావృద్ధికి కేసీఆర్ అహర్నిశలు శ్రమించిన మాదిరిగా ఎమ్మెల్యే గూడెం మహీపాల్‌రెడ్డి పటన్‌చెరు అభ్యున్నతికి రేయింబవళ్లు కృషి చేసారని కితాబునిచ్చారు. సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ఆయన అభివృద్ధి చేసారని అన్నారు. జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు పటన్‌చెరు ఆదర్శంగా మారింది అనడంలో ఎంతమాత్రము అతిశయోక్తి లేదన్నారు. కాంగ్రెస్ శాసనసభ టికెట్లు దేశ రాజధాని ఢిల్లీలో వేలం వేస్తున్నారని, ఎవరు ఎక్కువ ఇస్తే వారికే టికెట్లు ఇస్తారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎద్దేవా చేసారు. పార్టీలో ఉండి సంవత్సరాల నుండి సేవ చేసిన వారికి కాంగ్రెస్‌లో ఏమాత్రం గుర్తింపు ఉండదన్నారు. ప్రజల సమస్యలతో ఏమాత్రం పట్టించుకోని వారు కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఇచ్చి ఎన్నికల బరిలో నిలుస్తారని అన్నారు. మెదక్ ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిలు మాట్లాడుతూ కోట్ల రూపాయలు వ్యయం చేసి రహదారులు, భవనాలు శాఖ ద్వారా అనేక హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించడం జరిగిందని వివరించారు. మండల పరిధిలోని మారుమూల గ్రామాలలో సైతం నాణ్యమైన రోడ్లు నిర్మించడంతో రవాణా సౌకర్యం చాలా మెరుగు పడిందన్నారు. కార్యక్రమంలో యాదవుల సంఘం జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, కురుమల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..గొల్లకుర్మల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని