తెలంగాణ

విద్యార్థుల చేతిల్లోనే దేశ భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 8: దేశ భవిష్యత్‌ను రూపుదిద్దే ఆయుధం విద్యార్థుల చేతిలోనే ఉందని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం వరంగల్ ‘నిట్’లో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం 2030 నాటికి మూడవ సంపన్న దేశంగా ఎదుగుతుందని చెప్పారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు సరికొత్త పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని ఆయన అన్నారు. భారతదేశంలో అనేక పెద్ద పెద్ద కంపెనీలలో ఉన్నతమైన స్ధానాల్లో భారతీయులే ఉన్నారని ఆయన అన్నారు. భారతదేశం గొప్ప దేశంగా ఎదగడానికి విద్యార్ధుల చేతిలోనే ఉందన్నారు. ఇక్కడ యువశక్తికి ఎలాంటి కొదవలేదని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటిన భారతదేశంలో ఇంకా 20శాంతం పేదరికం, మరో 20 శాతం నిరక్షరాస్యత ఉందని అన్నారు. పరస్పర సహకారంతోనే దేశాభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. భారత దేశంలో 65శాతం జనాభా 35ఏళ్ల వయస్సు వారే ఉన్నారని అన్నారు. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే పన్నులు వసూళ్లు తప్పనిసరి అని అయితే పన్నుల వసూళ్లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని అన్నారు. వరంగల్ గొప్ప వారసత్వ సంపద గల నగరం అన్నారు. తనకు గత కొన్ని సంవత్సరాలుగా వరంగల్ నగరంతో మంచి సంబంధాలు ఉండేవని, అందువల్లే తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వరంగల్‌పై ఉన్న ప్రేమతోనే ఎవరి ప్రతిపాదన లేకపోయినా వరంగల్ నగరాన్ని స్మార్టుసిటీలో చేర్చానని చెప్పారు. వరంగల్ స్మార్ట్ సిటీలో నిట్ విద్యార్థులు భాగస్వామ్యం కావాలని కోరారు. విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానంతో నగరం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. పట్టణాల అభివృద్ధిలో భూకబ్జాలకు తావులేకుండా ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. తాను ఎబివిపి నాయకుని ఉన్న కాలంలో వరంగల్ నిట్‌తో సంబంధం ఉందని చెప్పారు. కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష, జాతీ సమైక్యత, గురువు ఈ ఐదు సూత్రాలు పాటించినట్లైతే అలాంటి వారు దేశంలో ఉన్నత స్ధానానికి చేరుకుంటారని అన్నారు. తెలంగాణలో ప్రతిఏటా జరిగే బతుకమ్మ పండుగలో చక్కటి మెసేజ్ అందని చెపుతూనే ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా నిట్‌లో 25కోట్లతో నిర్మిస్తున్న అల్యూమినీ కనె్వన్షన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ ఎన్‌వీ రమణారావు తదితరులు ఉన్నారు. వెంకయ్యనాయుడు రాక సందర్ధంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.

చిత్రం.. బుక్ విడుదల చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు