తెలంగాణ

రేపే బీజేపీ కరీంనగర్ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఒంటరి పోరు సాగిస్తూనే ఉనికిని చాటుకునేందుకు బీజేపీ ఎన్నికల వ్యూహాలను రచిస్తోంది. జాతీయ నాయకత్వం , రాష్ట్ర నాయకత్వం ఈ విషయాన్ని ఏడాది ముందుగానే స్పష్టం చేసి ఎన్నికల ప్రచారానికి బీజం వేసినా, అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్ వెళ్లడంతో అది బీజేపీకి సైతం కలిసొచ్చింది. ముందుగానే బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకున్న బీజేపీ నియోజకవర్గ స్థాయిలో అనేక ప్రజా ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించింది. ముందస్తు ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే మహబూబ్‌నగర్‌లో భారీ సభను నిర్వహించిన బీజేపీ మరో భారీ సభను ఈ నెల 10న కరీంనగర్‌లో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు. ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్‌లో పలు భేటీల్లో పాల్గొన్న అనంతరం కరీంనగర్ సభకు వెళ్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు ఆపై స్థాయి నాయకుల సమావేశంలో పాల్గొని మార్గదర్శనం చేస్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, ఇతర రాష్ట్ర నేతలూ పాల్గొంటారు. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 10వ తేదీ ఉదయం 10 గంటలకు జరుగుతుంది. అదే విధంగా మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, భువనగిరి, నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గాల శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జిల సమావేశం కూడా జరుగుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జరిగే సమరభేరి బహిరంగ సభకు హాజరవుతారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ సీనియర్లతో భేటీ కానున్నారు. బహిరంగ సభాముఖంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలను, రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయాన్ని వివరించనున్నారు. అభివృద్ధిలో బీజేపీ రాజకీయాలను చూడదని, రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేరుస్తుందని, అభివృద్ధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని ఆయన స్పష్టం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసే బదులు, రాష్ట్రానికి ఏం చేశామో చెప్పడానికే కేంద్ర పార్టీ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ నెలాఖరులో 28న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బీజేపీ యువమోర్చ జాతీయ సమ్మేళనం ముగింపు సభలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గోనున్నారు. తెలంగాణ యువమోర్చ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డజనుకుపైగా కేంద్ర మంత్రుల షెడ్యూలు ఖరారైంది. మూడు రోజుల పాటు అక్టోబర్ 26 నుండి జరిగే ఈ సమ్మేళనం ముగింపు రోజున లక్ష మంది కార్యకర్తలు సభకు హాజరయ్యేలా చూడాలని, తద్వారా ఎన్నికల కురుక్షేత్రానికి మంచి ఊపునివ్వాలని పార్టీ యోచిస్తోంది.
అమిత్‌షా పర్యటనను , కరీంనగర్ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర కమిటీ మరోమారు సోమవారం నాడు భేటీ అయి సమీక్షించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ కరీంనగర్ వెళ్లి స్వయంగా సమావేశ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అలాగే కరీంనగర్‌లో శక్తికేంద్రాల ప్రతినిధుల సభను నిర్వహించి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.