తెలంగాణ

ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణ శాసనసభకు జరిగే ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఎన్నికల కమిషన్ ఉక్కుపాదం మోపుతోంది. ఎన్నికల నియమావళి ఇప్పటికే అమల్లోకి రావడంతో ఉల్లంఘనలపై దృష్టి పెట్టింది. నియమావళి ఉల్లంఘనల సంఘటనలపై రాష్ట్ర ఎలక్టోరల్ ఆఫీసర్ మొదలుకుని గ్రామస్థాయిలోని రెవెన్యూ అధికారి వరకు దృష్టి పెట్టారు. రాష్ట్ర ఎలక్టోరల్ అధికారి డాక్టర్ రజత్ కుమార్ మంగళవారం జారీ చేసిన ప్రకటన ప్రకారం ఇప్పటి వరకు 1,25,785 ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు, ప్రైవేట్‌స్థలాలు, ప్రైవేట్ భవనాలు తదితరాలపై జెండాలు ఎగరేయడం, ఫ్లెక్సీలు కట్టడం, వాల్‌పోస్టర్లు వేయడం, గోడలపై ఎన్నికల నినాదాలు రాయడం తదితర అన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయని, వీటిని పరిశీలిస్తున్నామన్నారు. నియమావళికి విరుద్దంగా ఉన్న సంఘటనల్లో ఇప్పటి వరకు 55 కేసులను నమోదు చేసినట్టు సీఈఓ తెలిపారు. ఉల్లంఘనలకు పాల్పడ్డ సంఘటనల్లో ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఇప్పటి వరకు 55,040 ఉల్లంఘనలు జరిగాయని, ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి మిగతా సంఘటనలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆస్తులపై ఏర్పాటు చేసిన 79,703 జండాలు, బ్యానర్లు తదితర ప్రచార సామాగ్రిలను తొలగించామని, ప్రైవేట్ ఆస్తులపై 45,980 పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తదితర ప్రచార సామాగ్రిని తొలగించామని రజత్ కుమార్ వివరించారు.