తెలంగాణ

ప్రకటనల అనుమతికి కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: రాష్ట్రంలో జరగనున్న సాధారణ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తాము మీడియాకు విడుదల చేసే ప్రకటనలకు సంబంధించి అనుమతి ఇచ్చే అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేకకమిటీని నియమించారు. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ అధికారి, ఎక్స్ అఫీషియో ముఖ్యకార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ పేరుతో మంగళవారం ఒక జీఓ జారీ అయింది. ఈ కమిటీకి జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి అమ్రపాలి కటాను చైర్‌పర్సన్‌గా నియమించారు. పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ టీవీకే రెడ్డి, ప్రసార భారతి దూరదర్శన్ కేంద్రం ప్రోగ్రాం డైరెక్టర్ ఎం. విజయభగవాన్, ప్రసారభారతి ఆకాశవాణి కరెస్పాండెంట్ ఎం.ఎస్. లక్ష్మిని సభ్యులుగా నియమించారు. డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎం. సత్యవాణి మెంబర్ సెక్రటరీగా ఉంటారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రకటనలకు సంబంధించి తొలుత ఈ కమిటీ నుండి అనుమతి పొందాల్సి ఉంటుంది. పార్టీలు అభ్యర్థులు నిర్ణీత ఫారంలో దరఖాస్తు చేస్తే, వాటిని పరిశీలించి కమిటీ అనుమతిస్తూ సర్ట్ఫికేషన్ జారీ చేస్తుంది.