తెలంగాణ

ఎక్కువ ధరకు ఎరువులు అమ్మితే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: రాష్ట్రంలో రబీ సీజన్‌లో ఎరువులను ఎవరైనా ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి హెచ్చరించారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యవసాయ అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని మంగళవారం జారీ చేసిన అధికారిక లేఖలో ఆయన సూచించారు.
2018 అక్టోబర్ 1 నుండి ఎరువుల ధరల్లో మార్పులు, చేర్పులు జరిగాయని గుర్తు చేశారు. అక్టోబర్ 1 కన్నా ముందు విడుదల చేసిన ఎరువుల ధరలు తక్కువగా ఉన్నాయని, పాత స్టాకును పాత ధరలకే విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు. పాత స్టాకు సంచులపై ఉండే ఎరువుల ధరలకే వాటిని అమ్మాలని, ఎవరైనా ఈ ధరలను చిరిపివేసినా, పాతధరలపై స్టిక్కర్లు వేసినా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రిటైల్ వ్యాపారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (ప్యాక్స్) ఎరువులను విక్రయిస్తున్నాయని పార్థసారథి తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులను అందించేందుకు మార్క్‌ఫెడ్ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.