తెలంగాణ

గడీల పాలన అంతమవుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: గడీల పాలన అంతమయ్యే రోజు ఆసన్నమైందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి చెప్పారు. ఈ మేరకు హరీష్‌రావుకు నర్సిరెడ్డి ఒక లేఖ రాశారు. కేసీఆర్ ఆదేశాల మేరకే జేఏసీ నుండి టీడీపీని కోదండరామ్‌ను బహిష్కరించారని, లేఖలు రాయాల్సింది కాంగ్రెస్‌కో, కోదండరామ్‌కో, తెలుగుదేశం పార్టీకో కాదని, కేసీఆర్‌కు లేఖలు రాయాలని హరీష్‌రావుకు హితవుపలికారు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో తెలంగాణ ప్రజానీకానికి చేసిన ద్రోహానికి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెబుతూ లేఖ రాయాలని అన్నారు. తెలంగాణకు వాచ్ డాగ్ మాదిరి ఉంటామని కోదండరామ్ చెప్పారని, ఆ కర్తవ్యాన్ని ఆయన నెరవేరుస్తున్నారని, నిరుద్యోగుల తరఫున నిరసన తెలపడానికి ప్రయత్నిస్తే అర్థరాత్రి తలుపులు పగలగొట్టి భయభ్రాంతులకు గురిచేయడం ఉద్యమ స్ఫూర్తి అవుతుందా హరీష్‌రావు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. కోదండరామ్ కొన్ని సార్లు అనుకూలంగా వ్యవహరించలేదని జిల్లా జాక్ అధ్యక్షులతో రహస్య సమావేశం నిర్వహించి ఆయనను చైర్మన్ పదవి నుండి దించి వేయాలని ప్రయత్నించిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. తెలంగాణలో విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను అంగట్లో పశువుల మాదిరి కొని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన టీఆర్‌ఎస్ తిరిగి కోదండరామ్‌పై లేఖలు రాస్తూ నీతులు చెబుతారా అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్లే ఉండబోవని చెప్పి శృతి, సాగర్‌లను ఎన్‌కౌంటర్ చేసిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు.