తెలంగాణ

ఇంటర్ జాక్ ఆధ్వర్యంలో బతుకమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: ఇంటర్ విద్య జాక్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. జూనియర్ కాలేజీల మహిళా లెక్చరర్లు, విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. జాక్ చైర్మన్ డాక్టర్ పి మధుసూధనరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో టీఎస్‌పీఎస్సీ సభ్యుడు సి విఠల్, టీఎన్‌జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, టీజీవొ అద్యక్షురాలు మమత, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ సంఘం అధ్యక్షుడు కృష్ణకుమార్, లెక్చరర్ల సంఘం ప్రధానకార్యదర్శి బాబూరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గ్రామీణ ప్రజల అస్తిత్వాన్ని తెలిపే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. అంతా ఐకమత్యంతో కలిసి ఉండాలని చాటిచెప్పే బతుకమ్మ పండుగ మహిళలకు ఎంతో విశిష్టమైందన్నారు.