తెలంగాణ

ఓటర్ల తుది జాబితాపై నేడు కోర్టులో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఒకవైపు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు ఈ కమిషన్ న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 2018 డిసెంబర్ 7 న పోలింగ్ నిర్వహించేందుకు ఇప్పటికే నిర్ణయించిన ఎన్నికల కమిషన్ ఇందుకు సంబంధించి 2018 నవంబర్ 11 న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏర్పాట్లలో భాగంగా ఈ నెల 12 ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని కమిషన్ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఓటర్ల జాబితా ప్రకటనకు హైకోర్టు ఇంకా ఆమోదం తెలపలేదు. తమ అంగీకారం తర్వాతనే ఓటర్ల జాబితా ప్రకటించాలని ఇప్పటికే హైకోర్టు ధర్మాసనం ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ భట్‌లతో కూడిన ధర్మాసనం గత శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకే ఎన్నికల కమిషన్ నడచుకోవాల్సి వస్తోంది. వాస్తవంగా ఓటర్ల తుది జాబితా ఈ నెల 8 న వెల్లడిస్తామని ఎన్నికల కమిషన్ మొదట ప్రకటించినప్పటికీ, హైకోర్టులో ఓటర్ల జాబితాపై విచారణ జరుగుతుండటం వల్ల ఓటర్ల జాబితా వెల్లడి తేదీని మార్పు చేసింది. ఓటర్ల జాబితాను అక్టోబర్ 8 న వెల్లడిస్తామని వారం రోజుల క్రితం ఎన్నికల కమిషన్ ప్రకటించినప్పటికీ, అదే రోజు కోర్టులో విచారణ ఉండటంతో ఈ తేదీని వాయిదా వేసింది. ఈ నెల 12 న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని కమిషన్ తెలియచేసింది. అయితే ఓటర్ల జాబితా వెల్లడించేందుకు హైకోర్టు ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్‌కు అనుమతి ఇవ్వలేదు. ఓటర్ల జాబితాపై తీసుకున్న చర్యలను వివరిస్తూ ఒక అఫిడవిట్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ హైకోర్టుకు అక్టోబర్ 8 న అందచేసింది. వాస్తవాలు ఇలా ఉండగా హైకోర్టు ఆదేశాలు జారీ కాకముందే ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా వెల్లడికి తేదీని ప్రకటించడం గమనార్హం.
ఓటర్ల జాబితాపై హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ కొనసాగిస్తోంది. ఈ అంశంపై దాఖలైన అన్ని కేసులను ఈ సందర్భంగా విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు చెబుతూ దాఖలైన పిటీషన్లను విచారించే హైకోర్టు ధర్మాసనం పిటీషనర్లతో పాటు, ఎన్నికల కమిషన్ వాదనలను కూడా బుధవారం వింటుంది. ఈ తరుణంలో ఈ నెల 12 న ఓటర్ల జాబితాను వెల్లడించేందుకు హైకోర్టు అనుమతిస్తుందా? లేదా? అన్న అంశంపై న్యాయనిపుణులు చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఈ అంశంపై కోర్టు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను మార్చుకోవాల్సి ఉంటుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.