తెలంగాణ

కొలిక్కి రాని పొత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: మహాకూటమి మధ్య ఇంకా పొత్తులు కొలిక్కి రాలేదు. టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు మంగళవారం జరిపిన చర్చలకు తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ హాజరుకాలేదు. ఇంత కాలం రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమించిన ప్రొఫెసర్ చివరకు కూటమితో కలిసి 7 సీట్లకే పరిమితమవుతున్నారన్న ప్రచారం, టీఆర్‌ఎస్ విమర్శలు వస్తున్నాయి. పైగా పోటీ చేసేందుకు వస్తున్న వారి సంఖ్య రోజు, రోజుకూ పెరుగుతున్నది. టీఆర్‌ఎస్‌లో టిక్కెట్లు ఆశించి, దక్కన వారు కూడా ప్రొఫెసర్ కోదండరామ్ వద్దకు వస్తున్నారని, ఆ పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. పైగా టీజేఎస్ తరఫున పోటీ చేయాలనుకున్న వారూ ఒంటరిగా పోటీ చేద్దామని పట్టుబడుతున్నారు. అయితే విపక్షాల ఓట్లు చీలిపోరాదన్న భావనతో కూటమితో కలిసి పోటీ చేద్ధామని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ మేరకు కోదండరామ్ తాము ఆశిస్తున్న 20 సీట్ల జాబితాను ఉత్తమ్‌కు అందజేశారు. తాము కోరుతున్న సీట్లు ఇస్తేనే చర్చలకు వస్తామని ఆయన గట్టిగా చెప్పారని తెలిసింది. కాగా దీనిపై ఒకటి, రెండు రోజుల్లో చెబుతానని ఉత్తమ్ ఆయనకు చెప్పినట్లు సమాచారం.
టీజేఎస్ కోరుతున్న సీట్లు ఇవే..
మిర్యాలగూడ, సూర్యాపేట, ఆలేరు, మహబూబ్‌నగర్, జడ్చర్ల, అచ్చంపేట, మెదక్, దుబ్బాక, కరీంనగర్, అసిఫాబాద్, పెద్దపల్లి, మెట్‌పల్లి, నిజామాబాద్, అశ్వారావుపేట, జనగాం, స్టేషన్ ఘన్‌పూర్, మల్కాజిగిరి, వరంగల్ పశ్చిమ, రామగుండం.
ఆ సంగతి తెలియదు: ఉత్తమ్
తమకు కావాల్సిన సీట్లు ఇవ్వకపోతే చర్చలకు రాలేమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అల్టిమేటం ఇచ్చిన విషయం తనకు తెలియదని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గండిపేటలోని గోల్కండ రిసార్ట్స్‌లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ టిక్కెట్ల స్క్రీనింగ్ కోసం ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శుల కింద మూడు సబ్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కోక్క సబ్ కమిటీ కింద 40 నియోజకవర్గాలు ఉంటాయని ఆయన చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు, నలుగురు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నామని అన్నారు.