తెలంగాణ

నిరుద్యోగులే మీ భరతం పడతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ భరతం పట్టడానికి నిరుద్యోగులే చాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోవల్సి వచ్చిందో కేసీఆర్ సమాధానం చెప్పితీరాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. ఇరువురు నేతలూ వేర్వేరుగా పాత్రికేయులతో మాట్లాడారు. మన ఉద్యోగాలు మనకే వస్తాయని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గొప్పలు చెప్పారని, తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ ముఖ్యమంత్రిగా నిండు సభలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని పదే పదే చెప్పారని వాస్తవంలో ఉద్యోగాల కల్పనలో సీఎం విఫలమయ్యారని దత్తాత్రేయ వివరించారు. నియామకాల కోసం అంటూ బడులు వదిలి , గదులు వదిలి రోడ్డెక్కిన యువత , నిరుద్యోగులు ఉద్యమాన్ని పోరుబాట పట్టించి, తమ శరీరాలకు నిప్పు అంటించుకుని తద్వారా ఉద్యమానికి అగ్గిరాజేసిన యువత నేడు ఇలా సొంత రాష్ట్రంలో సైతం ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకోవల్సిన పరిస్థితి రావడం అత్యంత విషాదకరమని దత్తాత్రేయ అన్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించకూడదనే టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని టీఎస్‌పీఎస్సీ తూచా తప్పకుండా పాటిస్తున్నట్టుగా నిన్న జరిగిన గ్రూప్-4 పరీక్షల నిర్వహణతో మరో మారు రుజవైందని దత్తాత్రేయ అన్నారు. ఉద్యోగ ప్రకటన నుండి నియామక పరీక్ష వరకూ టీఎస్పీఎస్సీ తన ట్రేడ్ మార్కు అయిన అలసత్వాన్ని ప్రదర్ళించి మరో మారు ఉద్యోగార్థులకు తీరని ఆవేదన మిగిల్చిందని అన్నారు. ఇంత వరకూ టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ఏ ఉద్యోగ ప్రకటనా కోర్టు మెట్లు దాటకుండా పూర్తికాలేదంటే అతిశయోక్తి కాదని అన్నారు. ప్రతిసారీ పరీక్షల సమయంలో అభ్యర్ధులకు తీవ్ర మానసిక ఆవేదనను కలిగిస్తోందని దత్తాత్రేయ చెప్పారు. ఇంత వరకూ 105 ప్రకటనలు విడుదల చేయగా, ముఖ్యమైన గ్రూప్-2, పీజీటీ, ఫారెస్టు ఆఫీసర్సు, వీఆర్‌ఓ, గ్రూప్-4 తదితర ప్రకటనలు అన్నీ అభ్యర్ధుల సహనానికి పరీక్షగా నిలిచాయని అన్నారు. గ్రూప్-2 ప్రకటన వచ్చి మూడేళ్లు గడిచినా, ఇంత వరకూ ఉద్యోగాలు కల్పించలేని దుస్థితిలో ఉందని అని ఆరోపించారు. లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నా, వాస్తవంలో అందులో సగం కూడా ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు.
సమాధానం చెప్పాల్సిందే
ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో కేసీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ నిలదీశారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, మోడీ ప్రభుత్వం అమలుచేసిన పథకాల గురించి అమిత్ షా కరీంనగర్ సభలో వివరిస్తారని అన్నారు. కాంగ్రెస్ నేతలు పగటి వేటకాళ్లలా మళ్లీ ప్రజల వద్దకు వెళ్తున్నారని అన్నారు. కాంగ్రెస్, తెలంగాణ ద్రోహులతో జతకట్టి మహాకూటమి పేరుతో ముందుకొస్తోందని అన్నారు. అమిత్ షా తెలంగాణ వస్తున్నారనగానే కాంగ్రెస్‌లో దడపట్టుకుందని చెప్పారు. ఎన్నికల సందర్భంగా మోదీ పర్యటనతో రాష్ట్రంలో రాజకీయం మారిపోనుందని ఆయన చెప్పారు. త్వరలో హైదరాబాద్‌లో జరిగే యువజన భారీ ర్యాలీకి బీజేపీ ముఖ్యమంత్రులు, అమిత్ షా కూడా హాజరవుతారని తెలిపారు.