తెలంగాణ

నేడు హైదరాబాద్‌కు అమిత్ షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం నాడు హైదరాబాద్ రానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వస్తారు. అక్కడి నుండి ఆయన బంజారాహిల్స్‌లోని కళింగ భవన్ వద్ద ఉన్న అగ్రసేన్ మహరాజ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం కాచిగూడలోని శ్యామ్‌బాబా ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడే సాధు సంత్‌లతో ఆయన సమావేశం అవుతారు. అనంతరం అక్కడి నుండి నేరుగా 12 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే పోలింగ్ బూత్ కార్యకర్తలతో సమావేశం అవుతారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు ఆపై స్థాయి నాయకులకు పార్టీ లక్ష్యాలను వివరిస్తారు. ఒంటి గంటకు తిరిగి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని భోజనం చేస్తారు. అనంతరం స్వల్ప విరామం తీసుకున్న తర్వాత రెండు గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో కరీంనగర్‌లో జరిగే ఎన్నికల సమరభేరి సభలో పాల్గొంటారు. బంజారాహిల్స్‌లో జరిగే అగ్రసేన్ పూలమాల కార్యక్రమంలో అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పి మురళీధరరావు, కేంద్ర ఆరోగ్యమంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఇన్‌ఛార్జి పి కృష్ణదాస్, జి కిషన్‌రెడ్డి, ఎన్ రామచందర్‌రావు, పేరాల శేఖర్ రావు తదితరులు పాల్గొంటారు. సాధు సంత్‌ల భేటీలో తెలంగాణలో పరిస్థితులు, పోలీసులచేత పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ అంశం కూడా చర్చకు రానున్నట్టు తెలిసింది. ముందస్తు ఎన్నికలతో తొలుత ఢీలా పడిన బీజేపీ మహబూబ్‌నగర్ సభ, మహిళా భేరి కార్యక్రమాలతో కోలుకుని ఊపందుకుంది. ముందుగానే శక్తికేంద్రాలను ఏర్పాటు చేసుకున్న బీజేపీ రాష్టస్థ్రాయిలో కీలకమైన అంశాలను ఎంపిక చేసుకుని వాటిపై పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహించింది. ప్రధానంగా నిరుద్యోగ సమస్య, పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్షల నిర్వహణలో గందరగోళం, మహిళలపై దాడులు, మద్యం అమ్మకాలు, బీసీల సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, హైదరాబాద్ నగర అభివృద్ధిపై పెద్ద ఎత్తున నిర్వహించిన ఉద్యమాలకు మంచి స్పందనే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికల ప్రకటన చేయగానే , వెంటనే మహబూబ్‌నగర్‌లో భారీ సభను నిర్వహించిన బీజేపీ మరో భారీ సభను ఈ నెల 10న కరీంనగర్‌లో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మహబూబ్‌నగర్ సభలో ప్రతి పథకానికి కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు నిధులను మంజూరు చేసిందో పూర్తిగా చదివి వినిపించడమేగాక, అభివృద్ధి విషయంలో బీజేపీ రాజకీయాలను పట్టించుకోదని, ప్రజల సంక్షేమానికే పెద్ద పీట వేస్తుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కార్యక్రమాలను ముగించుకుని కరీంనగర్ అంబేద్కర్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. ఈ నెలాఖరులో 28న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బీజేపీ యువమోర్చ జాతీయ సమ్మేళనం ముగింపు సభలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గోనున్నారు. తెలంగాణ యువమోర్చ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డజనుకుపైగా కేంద్ర మంత్రుల షెడ్యూలు ఇప్పటికే ఖరారైంది. మూడు రోజుల పాటు అక్టోబర్ 26 నుండి జరిగే ఈ సమ్మేళనం ముగింపు రోజున లక్ష మంది కార్యకర్తలు సభకు హాజరయ్యేలా చూడాలని, తద్వారా ఎన్నికల కురుక్షేత్రానికి మంచి ఊపునివ్వాలని పార్టీ యోచిస్తోంది.