తెలంగాణ

టీఆర్‌ఎస్ మలి జాబితా ఖరారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్ర సమితి పెండింగ్‌లో పెట్టిన 14 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. అభ్యర్థుల ప్రకటనకు అమావాస్య అడ్డురావడంతో ఇంతకాలం ఆగిన అధిష్ఠానం గురువారం లేక శుక్రవారం ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. శాసనసభ రద్దు చేసిన రోజుననే 119 శాసనసభ నియోజకవర్గాలకుగాను 105 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో 2 నియోజకవర్గాలు (చార్మినార్, మలక్‌పేట) మిత్రపక్షం ఎంఐఎం ప్రాతినిథ్యం వహిస్తోన్న సిట్టింగ్ స్థానాలు కాగా మిగిలిన 12 స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయినట్టు తెలిసింది. మొదటి విడతలో ప్రకటించిన 105 మంది అభ్యర్థులలో ఐదు స్థానాలు మిత్రపక్షం ఎంఐఎంకు చెందిన స్థానాలు. రెండవ విడత ప్రకటించబోయే 14 స్థానాల్లోనూ రెండు ఎంఐఎం సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. ఏడు ఎంఐఎం సిట్టింగ్ స్థానాలకు కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించనున్నప్పటికీ వారంతా డమీలు మాత్రమే. ఎంఐఎం డమీ అభ్యర్థులను మినహాయించి 12 స్థానాలకు అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్టు తెలిసింది. వీటిలో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజ్‌గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు, మేడ్చల్ నుంచి సిహెచ్ మల్లారెడ్డి, గోషామహల్ నుంచి ప్రేమ్‌సింగ్ రాథోడ్, అంబర్‌పేట నుంచి ఎడ్ల సుధాకర్‌రెడ్డి/కాలేరు వెంకటేశ్, ముషిరాబాద్ నుంచి ముఠా గోపాల్, వరంగల్ ఈస్ట్ నుంచి మేయర్ నన్నపనేని నరేందర్, హుజర్‌నగర్ నుంచి సైదిరెడ్డి, కోదాడ నుంచి చందర్‌రావు, వికారాబాద్ నుంచి రాంచందర్, జహీరాబాద్ నుంచి ఎర్రోళ్ళ శ్రీనివాస్, చొప్పదండి నుంచి రవిశంకర్ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలా ఉండగా పెండింగ్ స్థానాలకు దాదాపు అభ్యర్థులంతా ఖరారైనప్పటికీ మంత్రి కేటీఆర్‌ను కలిసి ఏమైనా అవకాశం ఉంటే చూడండి ప్లీజ్ అని గుర్తు చేసారు. వీరిలో వరంగల్ ఈస్ట్ టికెట్ ఆశిస్తున్న గుండు సుధారాణి, చెన్నూరు టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి వినోద్ (ఈ స్థానానికి ఇప్పటికే ఎంపి బాల్క సుమన్‌ను ప్రకటించింది), ముషీరాబాద్ నుంచి నాయిని నరసింహారెడ్డి (తన అల్లుడు, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ అడుగుతున్నారు) ఉన్నారు. చెన్నూరు స్థానానికి ఇప్పటికే అభ్యర్థి బాల్క సుమన్‌ను ప్రకటించడంతో మార్చడం సాధ్యం కాదని వినోద్- వివేక్ బ్రదర్స్‌కు మంత్రి కేటీఆర్ స్పష్టం చేసారు.