తెలంగాణ

కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 10: చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు ముందస్తు ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని పీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతు భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులు 16రోజుల నుండి సాగించిన రీలే దీక్షల ముగింపు సభలో వారు హాజరై మాట్లాడుతు కేసీఆర్ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతు కేసీఆర్ ఉద్యమ సమయంలో, గత ఎన్నికల్లో చేనేత కార్మికులకు చెప్పిన మాటలు ఒక్కటి అమలు చేయలేదన్నారు. 50శాతం సబ్సిడీపై నూలు ఇస్తామని, రుణాలను మాఫీ చేస్తామని చెప్పి చేయ్యకపోగా చేసినట్లుగా చెప్పుకోవడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేనేత కార్మికుల సమస్యలు చేర్చి, అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతలకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత కార్మికుల వైద్యానికి ఐదు లక్షలు, ప్రమాద బీమాకు 5లక్షలు, 2వేల పింఛన్ వసతి కల్పిస్తామన్నారు. చేనేత కార్మికులతో పాటు రైతులను, గిరిజనులను, మైనార్టీలను అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌దేనన్నారు. బంగారు తెలంగాణ బాధల తెలంగాణగా మారిందని, కేసీఆర్ కుటుంబంలో ఐదుగురి పదవులొచ్చాయని, నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు, పేదలకు డబుల్ బెడ్‌రూమ్‌లు, ఎస్సీలకు మూడెకరాల భూమి, మైనార్టీలు, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు మాత్రం రాలేదన్నారు.

చిత్రం..భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికుల దీక్షల ముగింపు సభలో ఉత్తమ్, రమణ, చాడ అభివాదం