తెలంగాణ

మామకు మద్దతుగా అల్లుడి ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం ఏదంటే ఎవరైనా గజ్వేల్ అని చెప్పక తప్పదు. గడచిన 2014 ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గులాబీ దళపతి గెలుపొందాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ను బలంగా దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో పార్టీలన్ని ఏకమై మహాకూటమిగా జతకట్టాయి. గడచిన ఎన్నికల్లోనే కేసీఆర్‌తో ఢీకొన్న టీడీపీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి బలమైన ప్రత్యర్థిగా మారి టీఆర్‌ఎస్‌కు చెమటలు పట్టించాడు. ప్రస్తుతం ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండటం, టీడీపీ పొత్తుగా జత కట్టడంతో గజ్వేల్ నియోజకవర్గాన్ని టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గడచిన 2014 ఎన్నికల మాదిరిగానే గజ్వేల్ నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకున్న హరీష్‌రావు మామ కేసీఆర్ గెలుపుకు చెమటోడ్చాడు. ప్రతిపక్ష పార్టీలన్ని జతకలిసి టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగానే ప్రతాప్‌రెడ్డి కూడా కేసీఆర్‌ను ఓడించి చరిత్రను తిరగరాయాలన్న కసితో గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. స్తబ్దుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి వారం రోజుల క్రితం తన మద్దతుదారులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి టీఆర్‌ఎస్ పార్టీలో అలజడి రేకెత్తించాడు. నర్సారెడ్డి వ్యూహం ఏమిటో తెలియక అయోమయానికి గురైన టీఆర్‌ఎస్ నేతలు అపధర్మ మంత్రి హరీష్‌రావును రంగంలోకి దింపారు. ఈ మేరకు హరీష్ బుధవారం ఉదయం నర్సారెడ్డి ఇంటికి వెళ్లి మంతనాలు నిర్వహించి తన వాహనంలో ఎక్కించుకుని ప్రచారానికి వెళ్లినట్లు తెలిసింది. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో గజ్వేల్, ములుగు, వర్గల్, మర్కుక్, మనోహరాబాద్, తూప్రాన్, కొండపాక, జగదేవ్‌పూర్ తదితర మండలాలు ఉన్నాయి. ఈ సారి ఎన్నికల ప్రచార బాధ్యతలు తీసుకున్న హరీష్‌రావు పార్టీ శ్రేణులను వెంటబెట్టుకుని గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ తన వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ పట్టణంలో టీఆర్‌ఎస్‌పై ఉన్న అసంతృప్తిని పోగొట్టేందుకు హరీష్ ఏ విధమైన ప్రణాళికలు రూపొందిస్తారో ప్రతిపక్ష పార్టీకి అంతుచిక్కని అంశమే. రోడ్ల వెడల్పు కోసం ఇళ్లను కూల్చడంతో టీఆర్‌ఎస్‌కు బాధితుల సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. మల్లన్న సాగర్ రిజర్వాయర్‌తో పాటు కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణాలు గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక, మర్కుక్ మండలాల గ్రామాలు ఉన్నాయి. ముంపు గ్రామాల ప్రజలు టీఆర్‌ఎస్‌పై ఆగ్రహంతో ఉన్నారు. ఆ గ్రామాల ప్రజలను సమకట్టుకునేందుకు ఏ విధమైన ఎత్తులు వేస్తారోనన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మంత్రి హరీష్‌రావుకు తోడుగా కార్పోరేషన్ల చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, నర్సారెడ్డిలు ఉండటంతో టీఆర్‌ఎస్‌లో ధీమా వ్యక్తమవుతోంది. నామినేషన్ల దాఖలుకు ఇంకా నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా పార్టీలో అసంతృప్తి లేకుండా చక్కబెట్టుకునేందుకు హరీష్‌రావు వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మొత్తంమీద మామ గెలుపు బాధ్యతను అల్లుడు స్వీకరించి అందుకు అనుగుణంగా ప్రచార పర్వానికి తెర లేపడం గమనార్హం.