తెలంగాణ

దూరవిద్య పేరిట దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు తమ స్టడీ సెంటర్లను, ఆఫ్ క్యాంపస్‌లు ఇష్టానుసారం నిర్వహించడం కుదరదని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ మరో మారు స్పష్టం చేసింది. రాష్ట్రాల సరిహద్దులు దాటి ఆయా రాష్ట్రాల అనుమతి లేకుండా దూరవిద్యా కేంద్రాలు నిర్వహించడం చెల్లుబాటు కాదని, ఒక వేళ వేరే రాష్ట్రంలో దూర విద్యా కేంద్రాలు నిర్వహించినట్టయితే ఆయా కేంద్రాల కోసం యూజీసీ దూర విద్య కౌన్సిల్ అనుమతి పొందాలని సూచించింది. అనుబంధ కాలేజీల ద్వారా ఆయా యూనివర్శిటీలు నిర్వహిస్తున్న డిపార్టుమెంట్ సబ్జెక్టుల్లో మాత్రమే దూరవిద్యను నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయి యూనివర్శిటీలు మాత్రం ఆయా రాష్ట్రాల పరిధిలో మాత్రమే దూర విద్యా కేంద్రాలు నిర్వహించాలి. డీమ్డ్ వర్శిటీలు, ప్రైవేటు వర్శిటీలు ఏ కాలేజీకీ అనుబంధ గుర్తింపు ఇచ్చి వాటికి డిగ్రీలు ఇచ్చేందుకు వీలు లేదని కూడా స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ యూనివర్శిటీలు సైతం ఫ్రాంచైజీల ద్వారా దూర విద్య కేంద్రాలు నిర్వహించడానికి వీలు లేదని , గెజిట్‌లో పేర్కొన్న విధంగా నిబంధనలకు లోబడి డిగ్రీలను జారీ చేయవచ్చని సూచించింది. యూజీసీ హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న యూనివర్శిటీలు వేరే రాష్ట్రాల్లో ఇబ్బడి ముబ్బడిగా స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. అభ్యర్ధులకు రకారకాల ప్రలోభాలు చూపించి ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు చేస్తున్నాయి. వేలకు వేలు వెచ్చించి చేరి , కోర్సులు పూర్తి చేసిన తర్వాత వారిని అనర్హులుగా ప్రకటిస్తున్నాయి. దాంతో అభ్యర్ధులు ఇరకాటంలో పడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ సహా పలు సంస్థలు నాగార్జున వర్శిటీ నిర్వహించిన దూర విద్య కోర్సులు చెల్లుబాటు కావని పేర్కొంటుండగా, తమ వర్శిటీ డిగ్రీలు చెల్లుతాయని నాగార్జున వర్శిటీ తన వెబ్ పోర్టల్‌లో యూజీసీ మార్గదర్శకాలను పేర్కొంది. ఈ గందరగోళం మధ్య విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నా, రాష్ట్ర ఉన్నతాధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.