తెలంగాణ

బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: బతుకమ్మ పండగలో భాగంగా రాష్ట్ర సచివాలయంలో మహిళా ఉద్యోగులు బుధవారం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. అందరూ కలిసి బతుకమ్మలను తయారు చేసి, కోలాటం వేశారు. పాటలు పాడారు. బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు నుండి కూడా సచివాలయంలో మహిళా ఉద్యోగులు బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉద్యమ సమయంలో మహిళా ఉద్యోగులు బతుకమ్మను వేడుకునేవారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి తన వంతు సహకారం మహిళా ఉద్యోగులకు అందించారు. ప్రత్యేక షామియానాలు వేయించారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు మహిళా ఉద్యోగులకు అవకాశం ఇచ్చారు.

చిత్రం..సచివాలయంలో బతుకమ్మ ఆడుతున్న మహిళా ఉద్యోగులు