తెలంగాణ

డీఎస్ రాజీనామాపై హైడ్రామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: డీ శ్రీనివాస్ రాజీనామాతో ఖాళీ అయ్యే రాజ్యసభ సీటును అదే జిల్లాకు చెందిన కెఆర్ సురేశ్‌రెడ్డికి కేటాయించాలని టీఆర్‌ఎస్ అధిష్ఠానం యోచిస్తోన్నట్టు సమాచారం. డీఎస్ తనంతకుతాను రాజీనామా చేస్తే తప్ప రాజ్యసభ సీటు ఖాళీ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ అంతకుముందే పార్టీ సస్పెండ్ చేస్తే పదవీకాలం (ఆరు సంవత్సరాలు) ముగిసే వరకు ఆయన కొనసాగడానికి అవకాశం ఉంది. డీఎస్ రాజీనామా చేస్తే రాజ్యసభ సీటు ఖాళీ అవుతుందని టీఆర్‌ఎస్ ఎదురు చూస్తుండగా, పార్టీయే సస్పెండ్ చేస్తే పదవీకాలం ముగిసే వరకు కొనసాగవచ్చని డీఎస్ భావిస్తున్నట్టు సమాచారం. టీఆర్‌ఎస్, డీఎస్ ఇరుపక్షాల ఎత్తులు, పై ఎత్తుల వల్ల ఈ అంశం ఎటూ తేలడం లేదని టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. ఇలా ఉండగా అక్టోబర్ 10న టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయనున్నట్టు ఇదివరకే డీ శ్రీనివాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించాకైనా తనను సస్పెండ్ చేస్తుందేమోనని డీఎస్ ఎదురు చూస్తున్నారు. అయితే సస్పెండ్ చేయడం వల్ల రాజ్యసభ సీటు ఖాళీకి అవకాశం ఉండదని టీఆర్‌ఎస్ భావిస్తోంది. డీఎస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే. డీఎస్ ఖాళీ చేసే రాజ్యసభ సీటును ఆశించే మాజీ స్పీకర్ కెఆర్ సురేశ్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరినట్టు కూడా ఈ వర్గాల సమాచారం. రాజ్యసభ సీటు చుట్టూ తిరుగుతోన్న డీఎస్, టీఆర్‌ఎస్ రాజకీయం అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.