తెలంగాణ

టీఆర్‌ఎస్ ఓటమి ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: ముందస్తు ఎన్నికలకు ఉత్సాహంగా వెళ్ళిన టీఆర్‌ఎస్ గ్రాఫ్ రోజు, రోజుకూ పడిపోతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ అన్నారు. అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్‌ఎస్‌లో రాజకీయాలు, అసమ్మతులు పెరిగాయని ఆయన శనివారం పార్టీలో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ప్రగతి నివేదన సభ ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్ ఓటమి ఖాయం అని తెలుసుకున్న అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తన భాషను మార్చారని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్ నేతలను ప్రజలు అడుగడుగునా నిలదీస్తున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బూటకపు మ్యానిఫెస్టొతో ప్రజల్లోకి వెళుతున్నదని ఆయన తెలిపారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షాను విమర్శించే స్థాయి అపద్ధర్మ మంత్రి కే. తారక రామారావుకు లేదని అన్నారు. ఈ నెల 28న అమీత్ షా మూడో విడత ప్రచారానికి రాష్ట్రానికి రానున్నారని ఆయన తెలిపారు. బాబు మోహన్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై రాళ్ళు వేసిన వ్యక్తికే టిక్కెట్ ఇవ్వడం బాధాకరమని అన్నారు.