తెలంగాణ

మద్యం షాపుల్లో సీసీ కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో పాటు చివరిగా పోలింగ్ తేదీ వరకు తెలంగాణలో మద్యం షాపుల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అలా లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ హెచ్చరించారు. శనివారం హైదరాబాద్ జలసౌధలో ఈసీ, ఎక్సైజ్, పోలీసుశాఖల ఆధ్వర్యంలో ఉమ్మడిగా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎన్నికల అధికారి రజత్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమేష్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి మూడు శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఎన్నికల కోడ్‌ను అమలు చేయడానకి ఎక్సైజ్ శాఖ సైతం సిద్ధమవుతోందని చెప్పారు. అక్రమ మద్యం నిరోధానికి రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేస్తామని వెల్లడించారు. జిల్లాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై నిఘా పెట్టాలని, అలాగే మద్యం షాపుల్లో సీసీ కెమెరాలను యజమానులు తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి షాపులో ప్రత్యేకంగా రిజిష్టర్‌లు ఏర్పాటు చేయాలని, పెద్ద మొత్తంలో మద్యం విక్రయాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బస్సులు ఇతర వాహనాల్లో తనిఖీలను ముమ్మంగా చేస్తామని చెప్పారు. గొడవలకు పాల్పడే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితులు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. మాదక ద్రవ్యాల సరఫరా జరగకుండా చూడాలన్నారు.