తెలంగాణ

ముందస్తులో కమల వికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: ముందస్తు ఎన్నికల్లో కమలం వికసిస్తుందని బీజేపీ జాతీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ధీమాగా అన్నారు. శనివారం దత్తాత్రేయ అధ్యక్షతన పార్టీ పట్టణ మేనిఫెస్టో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో తమ పార్టీ 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి, విజయం సాధిస్తుందని అన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాల పరిశీలన కోసం 32 కమిటీలు నియమించినట్లు ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని రాష్ట్ర అపద్ధర్మ మంత్రి టీ. హరీష్ రావు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందాన్నరు. మద్ధతు ధర కోసం ఉద్యమాలు చేసిన రైతులను జైలులో పెట్టించింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా? అని ఆయన ప్రశ్నించారు. తమకు నీతులు చెప్పే నైతిక హక్కు టీఆర్‌ఎస్ నేతలకు లేదన్నారు. కేంద్రం ఇచ్చే మద్దతు ధర తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వలేదని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపించిందని ఆయన విమర్శించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్రం ఇచ్చిన నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వకుండా మింగేసిందని ఆయన దుయ్యబట్టారు. కాబట్టి అపద్ధర్మ మంత్రి హరీష్ రావు విమర్శించే ముందు ఆలోచించి చేయాలన్నారు. రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్రం బాగా సహాయం చేస్తున్నదని అంటూ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారని ఆయన విమర్శించారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా అడిగిన ప్రశ్నలకు టీఆర్‌ఎస్ సమాధానం చెప్పే స్థితిలో లేదన్నారు. అమీత్ షావి డ్రామాలు అని టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ చేసిన డ్రామాను ప్రజలు గమనించారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అంటేనే డ్రామాల పార్టీ అని అన్నారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చింది కాంగ్రెస్సేనని ఆయన విమర్శించారు. టీడీపీకి ఓటు బ్యాంకు లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లెఫ్ట్ పార్టీలు ఎక్కడ ఉన్నాయో దూరదర్శన్‌లో వెతుక్కోవాలని ఆయన తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్, సీపీఐలు జత కలిసి కలలు కంటున్నాయని దత్తాత్రేయ విమర్శించారు.
చిత్రం..మేనిఫెస్టో రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ