తెలంగాణ

ఎన్నికల సంఘం పంతాలకు పోరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: ఓటర్ల నమోదు ప్రక్రియలో అనేక తప్పులు దొర్లాయి కాబట్టి ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. వారం రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నా, పరిష్కారం కావడం లేదన్నారు. రెండు రోజుల క్రితం ఈవీఎంల గోడౌన్‌ను తెరిచారని, మళ్ళీ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా గోడౌన్ తెరిచారని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. నోడల్ అధికారి సమక్షంలో ఈవీఎంల సీలు తీసి, మళ్లీ సీలు వేసే వరకు వీడియో తీయాల్సి ఉంటుందన్నారు. తాము ఎన్నికల సంఘానికి వ్యతిరేకం కాదని, కానీ ఎన్నికల సంఘం సరిగ్గా పనిచేయకపోతే తప్పకుండా ప్రశ్నిస్తామని ఆయన చెప్పారు. రాజ్యాంగ అధికారాలు ఉన్న ఎన్నికల సంఘానికి సాంకేతిక సమస్యతో కొన్ని చేయలేకపోతున్నామని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఓటర్ల నమోదులో జరిగిన లోపాలను సరిచేయకుండా పంతానికి పోయిన ఎన్నికల తేదీల షెడ్యూలును ప్రకటించడం భావ్యంకాదని విమర్శించారు. పార్టీ నాయకుడు నిరంజన్ మాట్లాడుతూ ఇవీఎంల గోడౌన్ తెరిచినప్పుడు వీడియో రికార్డింగ్ చేయడం లేదని, గందరగోళం జరగనుందోనన్న అనుమానాలను వ్యక్తం చేశారు.