తెలంగాణ

టీఆర్‌ఎస్‌కు బినామీ బీఎల్‌ఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణలో రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ టీఆర్‌ఎస్‌కు బినామీగా పనిచేయడం పట్ల తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వామపక్ష భావాలు ఉన్న సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం కేసీఆర్‌కు వంతపలకడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా సీపీఐ గత నాలుగేళ్ళుగా ప్రజాస్వామ్య ఉద్యమాలను చేపట్టిందన్నారు. తమ్మినేని భిన్నమైన దోరణితో మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి తమ్మినేని వీరభద్రం అత్యుత్సాహం చూపించడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సీపీఐ అవకాశవాద రాజకీయాలను నడుపుతోందన్న తమ్మినేని మాటలను ఆయన తోసిపుచ్చారు. తమ్మినేని తన మాటలను మరోసారి పునరాలోచించుకోవాలని చాడ హితవు పలికారు. తెలంగాణలో సీపీఐతో కలసి పని చేయడానకి సీపీఎంకు లేఖ రాశామని, అయితే అందుకు సీపీఎం నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. వామపక్షాలతో సీపీఐతో అంగీకారం లేకుండా ఏకపక్షంగా టి- మాస్‌ను, బహుజన లెప్టఫ్రంట్‌ను ఏర్పాటు చేసి పెద్దన్న దోరణితో సీపీఎం వ్యవహరిస్తోందన్నారు. ఒకే వేదికపైకి సీపీఎం రాకపోవడంతో వామపక్ష వేదికను ఏర్పాటు చేయలేకపోయామని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఏఐటీయూసీకి మద్దతు ఇవ్వాలని స్వయంగా తమ్మినేని కోరినప్పటికీ ఆయన నిరాకరించారని చెప్పారు. సీఐటీయూ స్వతంత్రంగా పోటీ చేసినందున 1700 ఓట్లు చీలి టీఆర్‌ఎస్ అనుబంధ యూనియన్‌కు లాభం చేకూరిందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్ అభ్యర్థులను అసెంబ్లీ బరిలోకి దింపడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సొమ్ము చేసుకుంటారని ఆయన వివరించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీఆర్‌ఎస్‌కు మరోసారి పట్టంకట్టి తెలంగాణకు ద్రోహం చేయడమే సీపీఎం లక్ష్యమా? అంటూ చాడ నిలదీశారు. సీపీఎం ఏర్పాటు చేసిన బీఎల్‌ఎఫ్ ముమ్మాటికీ ముఖ్యమంత్రికి పరోక్ష సహాయానికే అంటూ తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజాతంత్ర ఉద్యమ విశాల వేదిక కోసం సీపీఐ చేస్తున్న ప్రయత్నాన్ని అవకాశవాద రాజకీయంగా తమ్మినేని వీరభద్రం విమర్శించడం, తాను చేస్తున్న ఘోరమైన రాజకీయ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికేనని ఆయన విమర్శించారు.