తెలంగాణ

అభ్యర్థులవి తిరకాసు లెక్కలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: ఎన్నికల ఖర్చుపై కేంద్ర ఎన్నికల కమిషన్ విధించిన 28 లక్షల రూపాయల పరిమితి అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల సమయంలో 28 లక్షల రూపాయల మించి ఖర్చు చేయకూడదని ఎన్నికల కమిషన్ పరిమితి విధించింది. వాస్తవంగా ఇంతే ఖర్చుతో ఏ అభ్యర్థీ తన ప్రచారాన్ని పూర్తి చేయలేడు. అభ్యర్థులు అధికారికంగా ఖరారైన తర్వాత ఎన్నికల పరిశీలకులు (ఖర్చులకు సంబంధించిన వారు) రంగంలోకి వస్తారు. వారు వేర్వేరు మార్గాల ద్వారా అభ్యర్థుల ఖర్చు వివరాలును సేకరిస్తారు. దాంతో అభ్యర్థులకు కొద్దిగా ఇబ్బందే ఉంటుంది.
ఒక్కో శాసనసభ నియోజకవర్గంలో 80 గ్రామాలు మొదలుకుని 100 కుపైగా గ్రామాలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో రెండున్నర నుండి మొదలుకుని నాలుగు లక్షల ఓటర్ల వరకు ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఉన్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపు 95 శాతం సెగ్మెంట్లలో అభ్యర్థుల ఖర్చు రెండు కోట్ల రూపాయల నుండి ఐదారు కోట్ల రూపాయల వరకు ఉంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈ ఖర్చు ఇంతకు మించి కూడా ఉండే అవకాశం లేకపోలేదు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఒక్కో గ్రామంలో రెండు లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తుంటారు. కులసంఘాల ప్రతినిధులతో చర్చలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం, మతపరంగా కొద్ది సంఖ్యలో ఉండే గ్రామాల్లో ఆ యా మతాల వారికోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. పోలింగ్ పూర్తయ్యే వరకు ప్రచారం కోసం వాహనాలను వాడాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థి కనీసం 50 కిపైగా ఫోర్‌వీలర్ వాహనాలను వాడుతూ ఉంటారు. ఎన్నికల సమయంలో వాల్‌రైటింగ్, ఫ్లెక్సీల ఏర్పాటు, జెండాల ఏర్పాటు, మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తుంటారు. ఎన్నికల సమయంలో పనిచేసే కార్యకర్తలు, నేతలకు భోజనం, వసతి, మందు, విందు తదితర ఖర్చులన్నీ ఉంటాయి. ఎన్నికలు ప్రారంభం నాటినుంచి పూర్తయ్యే వరకు సంబంధిత అభ్యర్థి క్యాంపు కార్యాలయం హడావుడిగా ఉంటుంది. సమావేశాలు, సదస్సుల ఖర్చు తదితర ఖర్చులు పార్టీఖర్చులోకి వచ్చినప్పటికీ ఇతరత్రా ఖర్చు తడిసి బోలెడవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ప్రకటించింది. బహుజన లెఫ్ట్‌పార్టీ కూడా అభ్యర్థుల తొలిజాబితా ప్రకటించింది. ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల పేర్లను అధికారికం ప్రకటించకపోయినప్పటికీ, పోటీ చేయబోతున్న వారు తమ అభ్యర్థిత్వం ఖరారైనట్టే భావిస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ 2018 నవంబర్ 12 న జారీ అవుతుంది. నామినేషన్ల దాఖలు అదేరోజు ప్రారంభమై 19 వ తేదీ వరకు కొనసాగుతుంది. నవంబర్ 20 న నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహణకు 22 వరకు గడువు ఉంటుంది. పోలింగ్ డిసెంబర్ 7 న జరుగుతుంది. గెజిట్ నోటిఫికేషన్ వెలువడ్డరోజు నుండి పోలింగ్ వరకు 26 రోజుల గడువు ఉంటుంది. వాస్తవంగా నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అభ్యర్థులు ఎవరు రంగంలో ఉంటారో తేలిపోతుంది. అంటే అభ్యర్థులకు 15 రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉంటుంది. చివరి రెండురోజులు ప్రచారం చేసేందుకు వీలు ఉండదు కాబట్టి వాస్తవంగా 13 రోజుల మాత్రమే ప్రచారం చేసుకునేందుకు వీలుంటుంది. ఈ సమయమే అభ్యర్థులందరికీ కీలక సమయం. ప్రచారానికి ప్రధాన సమయం ఇదే.
టీఆర్‌ఎస్ అభ్యర్థులకు భలే ఛాన్స్
టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను ఇప్పటికే కేసీఆర్ ప్రకటంచడంతో ఆ యా అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. గ్రామాలకు వెళ్లడం సమావేశాలు నిర్వహించడం, కుల, మత పరమైన సంఘాలతో చర్చలు జరపడం, వాహనాల వినియోగం, పార్టీ జెండాలు ఏర్పాటు చేయడం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, కార్యకర్తలపై పెట్టే ఖర్చు తదితర రూపాల్లో ఎంత ఖర్చు చేసినా కోడ్ పరిధిలోకి వచ్చే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పుడు వీరు చేస్తున్న ఖర్చు ఎన్నికల ఖర్చులోకి రాకపోవడం వల్ల ఒకరకంగా ప్రచారం కోసం వీరికి లభించిన అవకాశం ‘్భలేఛాన్సు’గానే భావించాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం నామినేషన్ల ఉపసంసహరణ తర్వాత పోటీలో మిగిలే అభ్యర్థులకే కోడ్ ఆఫ్ కాండక్ట్, లెక్కల ఖర్చు వర్తిస్తాయి. అందువల్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులను ముందుగానే కేసీఆర్ ప్రకటించడంతో వారు ఎన్నికల ఖర్చు నుండి మినహాయింపు పొందినట్టే. టీఆర్‌ఎస్ అభ్యర్థులు గత 39 రోజుల నుండి ప్రచారం చేస్తూనే ఉన్నారు. వీరికి ధీటుగా ఇతర పార్టీలేవీ ఇప్పటి వరకు రంగంలోకి రాలేదు.
ఇతర పార్టీలకు ఇది పెద్ద మైనస్ పాయింటే. మొత్తంమీద ఎన్నికల కమిషన్‌కు అభ్యర్థులు సమర్పించే లెక్కల ఖర్చులు తిరకాసు లెక్కలుగానే భావించాల్సిఉంటుంది. ఏ కొద్దిమందో సరైన లెక్కలు ఇస్తారని పరిశీలకులు పేర్కొంటున్నారు.