తెలంగాణ

కేసీఆర్‌ను ఇందిర..ఎన్టీఆర్‌తో పోలుస్తారా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: కేసీఆర్‌ను ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌లతో కేటీఆర్ పోల్చడం పట్ల టీడీపీ నేతలు మండిపడ్డారు. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్, జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బక్కని నర్సింహులు ఆదివారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దేశప్రజల మన్ననలను పొందిన వ్యక్తులుగా ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌లు పేరుతెచ్చుకున్నారన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారో కేసీఆర్ ఎవరినీ సమ్మతింప చేయలేకపోయారని, ఈ ఎన్నికలు రెఫరెండం ఎలా అవుతాయో కేటీఆర్‌కైనా తెలుసో లేదోనని ఎద్దేవా చేశారు. విపక్ష పార్టీలకు చెందిన 30 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నప్పుడు రెఫరండం అనాల్సిందన్నారు. 90 శాతం ప్రజలు మీ వెంట ఉంటే ఇక సభలు, సమావేశాలు ఎందుకని వారు ప్రశ్నించారు. లాగులు, అంగీలు చించుకునే పరిస్థితి టీఆర్‌ఎస్ నేతలకే వస్తుందని దయాకర్‌రెడ్డి తదితరులు పేర్కొన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ చంద్రబాబు ఏనాడూ కేంద్రానికి కానీ ఇతరులకు కానీ లేఖలు రాయలేదని స్పష్టం చేశారు. ఆల్మట్టి, బాబ్లీ ప్రాజెక్టులపై పోరాటం చేసింది టీడీపీయేనని వివరించారు. ఒక్క టీఎంసీ నీరు కూడా వృథాగా పోకుండా కామన్ మినిమమ్ ప్రోగ్రాంను రూపొందిస్తున్నామన్నారు.
కృష్ణాజలాల వివాదం ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. మహాకూటమి ద్వారా తెలంగాణ ప్రజల కలలు సాకారం చేస్తామన్నారు. ఓట్ల కోసమే కేసీఆర్ తన హోదాను దిగజార్చుతూ మాట్లాడుతున్నారని విమర్శించారు.