తెలంగాణ

దుర్మార్గ పాలన అంతానికే పొత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న దుర్మార్గ పాలన అంతానికే ఇతర ప్రతిపక్షాలతో పొత్తులు పెట్టుకుంటున్నామని ఏఐసీసీ నాయకుడు మధుయాష్కీ గౌడ్ తెలిపారు. ఒంటిరిగా పోటీ చేసే సత్తా ఉన్నప్పటికీ ప్రతిపక్షాల ఓట్లు చీలిపోరాదన్న భావనతో కలిసి వచ్చే పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నామని ఆయన వివరించారు. ఆదివారం మాసబ్ ట్యాంక్, గోల్కండ హోటల్‌లో కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం జరిగింది. సమావేశానంతరం మధుయాష్కీ మీడియాతో మాట్లాడుతూ పొత్తులు తేలక అలకలు, పంచాయితీ జరుగుతున్నదన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. ఈ నెల 20న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు రానున్నందున, ఏర్పాట్లలో బిజీగా ఉన్నామన్నారు. అంతకుముందు జోగులాంభ దేవాలయం నుంచి పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి నాయకులతో చర్చలు జరిపి ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ఆయన వివరించారు. సీట్ల సర్దుబాటు కూడా ఒకటి, రెండు రోజుల్లో పూర్తవుతుందని, ఎటువంటి ఊహగానాలకు ఆస్కారం లేదని ఆయన చెప్పారు. టీఆర్‌ఎస్‌కు చెందిన అనేక మంది నాయకులు తమ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆయన తెలిపారు. వివిధ ప్రజా సంఘాలూ తమ పార్టీకి మద్దతునిస్తున్నాయని మధుయాష్కీ చెప్పారు.