తెలంగాణ

పాతవి నెరవేర్చకుండా కొత్త హామీలు ఎలా ఇస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇవ్వకుండా, కొత్త హామీలు ఎలా ఇస్తారని టీ.పీసీసీ అధికార ప్రతినిధి గజ్జల కాంతం టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తామన్న హామీ ఏమైందని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు 9 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చిందని, టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత ఏడు రకాలు నిలిపి వేసి, కేవలం వంట గ్యాస్, బియ్యం మాత్రమే ఇస్తున్నదని ఆయన తెలిపారు. అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు వ్యవహార శైలి నచ్చక చాలా మంది టీఆర్‌ఎస్‌ను వీడి, కాంగెస్‌లో చేరుతున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్, కేటీఆర్‌లు రాచరిక పాలన చేస్తున్నారని ఆయన విమర్శించారు. మహాకూటమి ఏర్పాటుతో కేసీఆర్, కేటీఆర్ వణికిపోతున్నారని ఆయన తెలిపారు. కేసీఆర్ మాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు.