తెలంగాణ

కూటమితో తెగతెంపులు చేసుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: మహాకూటమితో తాము తెగతెంపులు చేసుకోలేదని, కూటమిలో తమకు సముచిత స్థానం లభిస్తుందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధికార ప్రతినిధి వెదిరె యోగేశ్వర్ రెడ్డి తెలిపారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఉప ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నందుకే కూటమి చర్చలు కొలిక్కి రావడం లేదని కొన్ని పార్టీల నేతలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన సోమవారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. టీజేఎస్ అభ్యర్థులంతా తమ హస్తం గుర్తుపై పోటీ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తాము సీఎల్‌పీ నేత కె. జానారెడ్డిని కలిసినప్పుడు అటువంటి చర్చ జరగకపోయినా దుష్ప్రచారం జరగడడం బాధాకరమని ఆయన తెలిపారు.