తెలంగాణ

రైతులు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతుబంధు’ పథకాన్ని విజయవంతం చేసేందుకు రైతులంతా సహకరించాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి కోరారు. సచివాలయంలో మంగళవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, రైతుబంధు పథకం ద్వారా వానాకాలం పంటలకు ఎకరాకు నాలుగువేల రూపాయల పెట్టుబడిని మేనెల వరకే ఇచ్చామని, అలాగే యాసంగి పంటకు కూడా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామన్నారు. రైతుబంధు పథకం కింద చెక్కులను ఇవ్వాలని మొదట ఏర్పాట్లు చేశామని, తమ విజ్ఞప్తి మేరకు బ్యాంకర్లు కూడా రైతుల పేర్లతో చెక్కులు ఈనెల ప్రారంభంలో సిద్ధం చేశారన్నారు. రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నందు వల్ల ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు యాసంగికి రైతుబంధు నిధులను రైతుల పేర్లతో బ్యాంకు అకౌంట్లలో వేస్తున్నామన్నారు. రైతుబంధుకు సంబంధించి పదిరోజుల క్రితం కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు చేసిందని గుర్తు చేశారు. రైతులకు చెక్కులు ఇచ్చే బదులు వారి వారి అకౌంట్లలో డబ్బు జమచేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించిందని గుర్తు చేశారు. ఈ కారణంగానే ఈ నెల 6 తర్వాత రైతుల బ్యాంక్ అకౌంట్లను సేకరించే పని చేపట్టామన్నారు. రైతులు తమ పేరుతో ఉన్న భూమి వివరాల పాస్‌బుక్కు జిరాక్స్ కాపీ, బ్యాంక్ అకౌంట్ కోసం బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సంబంధిత వ్యవసాయ అధికారులకు అందించాలని ఇప్పటికే సూచించామన్నారు. రైతుల నుండి వివరాలు సేకరించేందుకు క్షేత్రస్థాయిలో తమ సిబ్బంది రంగంలోకి దిగారని తెలిపారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మంది రైతులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లు తదితర వివరాలను సేకరించామని చెప్పారు. తొలిదశలో అందుబాటులో ఉన్న రైతులందరి పేర్లతో వారి వారి బ్యాంక్ అకౌంట్లలో నాలుగైదు రోజుల్లో డబ్బు జమచేస్తామని పార్థసారథి తెలిపారు. ఈ పథకం సజావుగా కొనసాగేందుకు రైతులు సహకరించాలని, వెంటనే తమ పూర్తి వివరాలను సంబంధిత వ్యవసాయ అధికారులకు అందించాలని కోరారు.