తెలంగాణ

విద్యుత్‌కు తిత్లీ దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రలో విధ్వంసం సృష్టించిన తిత్లీ తుపాన్‌తో తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఉత్తరాది నుంచి తెలంగాణకు రావాల్సిన 3వేల మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. అత్యవసరంగా విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించడంతో విద్యుత్ అధికారులు పరుగులుతీస్తున్నారు. తిత్లీ తుఫాన్ దెబ్బతో ఉత్తరాంధ్రలో విద్యుత్ హైటెన్షన్ వైర్లు పూర్తిగా నెలకొరిగాయి. విద్యుత్ వ్యవస్థ మెరుగుపడడానికి మరో నెల రోజులు పడుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా విద్యుత్ శాఖ సీఎండీలు అత్యవసర సమావేశాల్లో బిజీ అయ్యారు. తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నందున విద్యుత్ లోటును అధిగమించడానికి అధికారులు వివిధ మార్గాలను పరిశీలిస్తున్నారు. ఛత్తీష్‌గఢ్, కర్నాటక నుంచి విద్యుత్ కొనుగోలుకు అక్కడి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ధర్మల్, హైడల్, సౌర విద్యుత్ కేంద్రాల నుంచి అధిక విద్యుత్ ఉత్పత్తి చేయడానికి సంబంధిత అధికారులను సీఎండీలు ఆదేశించారు.