తెలంగాణ

ఆర్‌ఎస్‌ఎస్ నేత మార్టూరి రామారావు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: ప్రముఖ ప్రింటింగ్ సంస్థ లలిత అండ్ కో అధినేత , ఆర్‌ఎస్‌ఎస్ నేత మార్టూరి రామారావు (87) మంగళవారం నాడు కన్నుమూశారు. మంగళవారం వేకువజామున ఆయన నిద్రలోనే తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ చిక్కడపల్లి అశోక్‌నగర్‌లో ఉంటున్న ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. దాదాపు 80 ఏళ్లకు పైగా లలిత అండ్ కో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఏలూరులో ఈ కంపెనీ ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ఈ సంస్థ సుపరిచితమే. ప్రస్తుతం కంపెనీని ఆయన పెద్ద కుమారుడు లలిత రవి కృష్ణ, చిన్న కుమారుడు సత్యప్రకాశ్ గిరి నిర్వహిస్తున్నారు. దగ్గరి బందువు అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల మార్టూరి రామారావు ఏలూరు వెళ్లారు. అక్కడే ఆయన నిద్రలోనే తుది శ్వాస విడిచారని ఆయన కుమారులు చెప్పారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చారు. బుధవారం ఉదయం బన్సీలాల్‌పేట స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు సత్యప్రకాష్ గిరి చెప్పారు. రామారావు వ్యాపారం నిర్వహిస్తూనే మరో పక్క ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2009లో జరిగిన హైదరాబాద్ ఎన్నికల్లో గిరి సతీమణి బీజేపీ తరఫున గాంధీనగర్ డివిజన్ నుండి పోటీ చేశారు. రామారావు మృతి సమాచారం తెలుసుకున్న పలువురు నేతలు అశోక్ నగర్‌లోని ఆయన ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.