తెలంగాణ

నిరంకుశ ప్రభుత్వాలను గద్దెదించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఆర్థిక కుంభకోణాల్లో కూరుకుపోయాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ముఖ్దూం భవనంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల కుంభకోణాలను ప్రజలకు తెలియజేయడానికి వీలులేకుండా మీడి యా మొత్తం అధికార పక్షం చేతిలోనే ఉందని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో వేలకోట్ల రూపాయలు కుంభకోణం జరిగితే దేశంలో 20 శాతం ప్రజలకు కూడా తెలియకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీటీపీ, టీజేఎస్‌లను కలుపుకొని టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వామపక్ష లౌకిక పార్టీల కూటమి కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయిని, అయితే మహాకూటమి విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగడంపట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్, అజీజ్ బాషా, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, గుండా మల్లేష్, పశ్యపద్మ, ఈర్ల నర్సింహా, తక్కళపల్లి శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న సురవరం సుధాకర్‌రెడ్డి