తెలంగాణ

కాంగ్రెస్ నాన్పుడిపై టీజేఎస్, సీపీఐ అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: ముందస్తు ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు సర్దుబాట్ల విషయంలో అనుసరిస్తున్న వైఖరి బాగా లేదని తెలంగాణ జన సమితి, సీపీఐ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ సీట్లు ఉండగా, అందులో హైదరాబాద్ లోక్‌సభ సీటును వదిలేసి, మిగతా 16 లోక్‌సభ సీట్లలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌ను తమకు ఇవ్వాల్సిందిగా కోరితే, దానికి అంగీకరించకుండా నెల రోజులుగా జాప్యం చేస్తున్నదని టీజేఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇంకా ఎంత కాలం ఇలా జాప్యం చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఏడు సీట్లు ఇస్తామని చెప్పడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ వైఖరితో బేజారెత్తిన తాము అన్ని స్థానాలకు పోటీ చేసేందుకు సిద్ధపడడంతో, ఓట్లు చీలిపోతాయంటూ బుజ్జగిస్తున్నారని వారు తెలిపారు. జిల్లాల నుంచి తమపై బాగా వత్తిడి ఉన్నందున, 16 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. టీజేఎస్‌ను వదిలేస్తే బీజేపీతో కలిసి పోటీ చేస్తుందేమోనన్న అనుమానాలూ కాంగ్రెస్ నేతలకు లేకపోలేదు. సీపీఐ నేతలు కూడా కాంగ్రెస్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు 9 సీట్లు కేటాయించకపోతే ఒంటరిగా పోటీ చేసేందుకు వెనుకాడమని అంటున్నారు. అయితే ఈ నెల 24న మలి విడత చర్చలు ఉన్నాయని, నెలాఖరులోగా కూటమి అభ్యర్థులను, ఉమ్మడి ప్రణాళికను ప్రకటించి ప్రచారంలో నిమగ్నం కావాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.