తెలంగాణ

రోశయ్యను అవమానిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: రాజకీయాల్లో భీష్మ పితామహుడైన తమిళనాడు మాజీ గవర్నర్ కే. రోశయ్యను అవమానించిన రాష్ట్ర అపద్ధర్మ మంత్రి కే. తారక రామారావు వెంటనే క్షమాపణ చెప్పాలని టీ.పీసీసీ అధికార ప్రతినిధి జి. నిరంజన్ డిమాండ్ చేశారు. ఈ నెల 20న రాజీవ్ గాంధీ సద్భావన దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేతుల మీదుగా కే. రోశయ్యను సద్భావన అవార్డును అందించడం జరిగిందన్నారు. రోశయ్యకు అవార్డు ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు సార్లు పాతనగరంలో మత కల్లోలాలు జరిగాయని అన్నారని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదన్నారు. వెంటనే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనేక హోదాలలో, పదవులలో పని చేసిన రోశయ్యను అవమానిస్తే తెలుగు ప్రజలను అవమానించినట్లేనని నిరంజన్ అన్నారు.