తెలంగాణ

టీడీపీలో చేరిన సినీనటి రేవతి చౌదరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: సినీనటి రేవతి చౌదరి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆమెను తెలుగు దేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సహా పలువురు నాయకులు హాజరయ్యారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీటీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులతో ఎన్టీఆర్ భవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశమై చర్చించరు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలోనే రేవతి టీడీపీలో చేరారు. విజయవాడకు చెందిన రేవతి చౌదరి నాగార్జున వర్శిటీలో పీజీ చేశారు. 1998లో మిస్ విజయవాడగా ఎంపికయ్యారు. తర్వాత సినీరంగంపై మక్కువతో హైదరాబాద్‌కు మకాం మార్చారు. శివాజీ హీరోగా ఒక సినిమాలో నటించారు. అయితే ఆ సినిమా అనివార్య కారణాలతో విడుదల కాలేదు. తర్వాత నందమూరి తారకరత్న హీరోగా నిర్మించిన కాకతీయుడు చిత్రంలో రేవతి నటించారు. పార్టీ అవకాశం ఇస్తే హైదరాబాద్‌లో ఏదో ఒక నియోజకవర్గం నుండి తాను పోటీచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు రేవతి చెబుతున్నారు.