తెలంగాణ

ఓటర్ల జాబితాలో అవతవకలు నిరూపిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: ఓటర్ల జాబితాలో జరిగిన అవతవకలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఎన్నికల సంఘానికి ఇదే నా సవాల్ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి సవాల్ అన్నారు. రాష్ట్ర హైకోర్టును ఎన్నికల సంఘం తప్పుదారి పట్టించిందని శశిధర్ రెడ్డి మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను సవరించినట్లు ఎన్నికల సంఘం హైకోర్టుకు చెప్పిందని, కానీ ఏ మాత్రం సరి చేయలేదని ఆయన విమర్శించారు. సవరించలేదన్న సమాచారంతో తాము 866 పేజీల నివేదికను హైకోర్టుకు సమర్పించామని ఆయన తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం (సి-డాక్)తో సవరించినట్లు ఎన్నికల సంఘం చెప్పడం పూర్తిగా అవాస్తవమని అన్నారు. మదర్ రోల్, సప్లిమెంట్ రోల్ అంటూ ఫార్మాట్‌ను ఇంకా వివాదస్పదం చేశారని ఆయన విమర్శించారు. 68 లక్షల ఓటర్ల అవకవతకలకు సంబంధించి తమ వద్ద సమాచారం ఉందని, ఎన్నికల సంఘం ముందు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని శశిధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలు పాటించలేదని ఆయన విమర్శించారు. కేంద్ర ఎన్నికల ప్రతినిధుల బృందం వద్ద తమ వాదన వినిపించినట్లు ఆయన చెప్పారు. ఎన్నికల సంఘం టీఆర్‌ఎస్ జేబు సంస్థగా మారిందని ఆయన దుయ్యబట్టారు. కళ్లు మూసుకుని సవరణలు చేశారా? అని ఆయన ప్రశ్నించారు. మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం పట్ల తాము కేంద్ర ఎన్నికల బృందం ముందు అభ్యంతరం చెప్పామని ఆయన తెలిపారు. ఒక పార్టీకి చెందిన రంగును ఉపయోగించడం భావ్యం కాదని శశిధర్ రెడ్డి అన్నారు.

చిత్రం.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి