తెలంగాణ

కాళేశ్వరంతో సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 23 : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని.. వచ్చే ఫిబ్రవరి నాటికి గోదావరి నీటిని సిద్దిపేట ప్రజలకు అందించేందుకు కృషిచేస్తానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 16 జిల్లాలకు సాగునీరు అందించబోతున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఐఎంఏ హాల్‌లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం, టీఆర్‌ఎస్ మద్దతు కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. ఇరిగేషన్ చరిత్రలో కాళేశ్వరం లాంటి పెద్దప్రాజెక్టు బహుశ ప్రపంచంలో ఉండదన్నారు. రంగనాయక్‌సాగర్ రిజర్వాయర్‌ను రాబోయే రోజుల్లో పర్యాటక రంగంగా మారుస్తానన్నారు. సిద్దిపేట నియోజకవర్గమే తన కుటుంబమని అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. మీ ఆలోచనలు అమలు చేయటంలో నా వంతు సంపూర్ణ, సహకారాలు ఉంటాయన్నారు. మీరు ఇస్తున్న మద్దతు జీవితంలో మరువలేనిదని, నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపాయన్నారు. ఈజీవితం పదిమందికి సహాయపడాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. మీరు మద్దతు తెలిపినందుకు మరింత బాధ్యతతో పనిచేసి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. సిద్దిపేటలో ప్లాస్టిక్ నిషేధ ఉద్యమంలో వైద్యులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు ప్లాస్టిక్ వాడవద్దని సూచించాలన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషిచేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను అధిక మెజార్టీతో గెలిపించి సిద్దిపేట గౌరవాన్ని నిలబెట్టాలని సూచించారు.
ప్రజల్లో చైతన్యం తేవాలి: ఎమ్మెల్సీ ఫారూక్
వచ్చే ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కృషిచేయాలని ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్ అన్నారు. పోలింగ్ శాతం పెరిగితేనే మెజార్టీ పెరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో హరీష్‌రావును భారీ మెజార్టీతో గెలిపించేందుకు వైద్యులు తమవంతు కృషిచేయాలన్నారు. తెలంగాణలో అన్ని నియోజకవర్గాల కంటే సిద్దిపేట మెజార్టీ ముందుండాలని ఆకాంక్షించారు. అభివృద్ధి చేయాలన్న తపన ఉన్న హరీష్‌రావు లాంటి నాయకుడిని తాను ఎక్కడ చూడలేదన్నారు. లక్షల మంది హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఏకైక నాయకుడు హరీష్‌రావు అని కొనియాడారు. టీఆర్‌ఎస్ సర్కార్‌తోనే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మళ్లీ టీఆర్‌ఎస్ సర్కార్ వచ్చేలా ప్రజలు తీర్పునివ్వాలని కోరారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ చైర్మన్ రాజేశం గౌడ్ మాట్లాడుతూ సిద్దిపేట అభివృద్ధి ఇతర నియోజక వర్గాలకు ప్రయోగశాలకు మారిందని, ఇక్కడి అభివృద్ధిని చూసి నేర్చుకుంటున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మహాద్భుతమని, కోటి ఎకరాల మాగాణే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హరీష్‌రావు లాంటి నిరంతరం శ్రమించే నాయకుడు మీకు లభించటం అదృష్టమన్నారు. ఐఎంఎ సీనియర్ డాక్టర్లు రాంచందర్‌రావు, చంద్రారెడ్డి, సతీష్, శ్రీనివాస్, భాస్కర్‌రావు, కృష్ణమూర్తిలు మాట్లాడుతూ సిద్దిపేట అభివృద్ధి ఎంతో అద్భుతమని, ఎక్కడికి వెళ్లినా సిద్దిపేట అని సగర్వంగా చెప్పుకుంటామన్నారు. సిద్దిపేట నాయకులు దేశ చరిత్రలో నిలవటం కన్నా గొప్ప అదృష్టం ఏముందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఐఎంఎ అధ్యక్షుడు శంకర్‌రావు, డీఎంహెచ్‌ఓ అమర్‌సింగ్, రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..ఐఎంఏ సిద్ధిపేట విభాగం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు