తెలంగాణ

కేసీఆర్ పాలనలో అవినీతి రాజ్యమేలింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 23: తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి రాజ్యమేలిందని.. అందుకే కేసీఆర్‌ను అధికారానికి దూరం పెట్టడానికి ప్రజలు నిర్ణయించుకున్నారని తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తల సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ దేశంలోగానీ, ఏ రాష్ట్రంలోగానీ ఒక కుటుంబ పాలన మంచిది కాదని తెలంగాణ రాష్ట్రంలో కూడా కుటుంబపాలన నాలుగేళ్లుగా కొనసాగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుటుంబపాలనపై ఉన్నంత దృష్టి ప్రజల అభివృద్ధిపై పెట్టలేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కుటుంబపాలనకు చరమగీతం పాడాల్సిందేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రూ. 2.71 లక్షల వేల కోట్లు నిధులు ఇచ్చిందని తెలిపారు. కానీ కేసీఆర్ మాత్రం కేంద్రం నిధులు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు రాష్ట్రానికి ఇచ్చిందో ప్రతి పైసాకు లెక్కపక్కాగా ఉందని ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హితవుపలికారు. కేంద్రం నుండి దండిగా నిధులు తీసుకుంటూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో పేద ప్రజలకు లక్ష ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఖర్చు చేయకుండా ఉండి పేదలకు అన్యాయం చేసింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. పార్లమెంట్. అసెంబ్లీ ఎన్నికలు రెండూ ఒకేసారి జరిగితే ప్రధానమంత్రి మోదీ చరిష్మా ముందు తాము తట్టుకోలేకపోతామని.. తెలంగాణలో సైతం బీజేపీ గెలుస్తుందని భయపడే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఆరోపించారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో ఇప్పటి వరకు సరైన సమాధానం ప్రజలకు చెప్పలేకపోయారని అన్నారు. అంతేకాకుండా తెలంగాణకు కృష్ణా జలాల వాటా గురించి కృష్ణా ట్రిబ్యునల్ ముందు కూడా తమ వాదనను వినిపించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఏ రాష్ట్రంలో చూసినా ఇంకా మహబూబ్‌నగర్ వలస కూలీలు ఇంకా ఉన్నారంటే అది కేసీఆర్ చేతగాని తనమేనని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఉపాధి కల్పించడంలో కూడా కేసీఆర్ వైఫల్యం చేందారని తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అన్ని రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అందులో తెలంగాణలో అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చితీరుతుందని నరేంద్రమోదీ మరోసారి ప్రధాన మంత్రిగా కూడా ఉంటారని దాంతో తెలంగాణ అభివృద్ధికి మరింత చేయూతను అందిస్తామని తెలిపారు. మక్తల్ నియోజకవర్గంలో కూడా బీజేపీ అభ్యర్థి కొండయ్యను గెలిపించి కమలం జెండా వికసింప జేయాలని అందుకుగాను ప్రతి కార్యకర్త పార్టీ కోసం 40 రోజుల పూర్తి సమయం ఇవ్వాలని కోరారు. ఈ సదస్సులో బీజేపీ నాయకులు శ్రీరాములు, శాంతికుమార్, ప్రేమ్‌రాజ్‌యాదవ్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మక్తల్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి కేంద్రమంత్రి జేపీ నడ్డా