తెలంగాణ

కూటమితోనే కలిసుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, అక్టోబర్ 23: రాష్ట్రంలో మరికొద్దిరోజుల్లో జరుగనున్న ముందస్తు ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా సీపీఐ పనిచేస్తున్నట్లు ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, నాలుగేళ్ళ పాలనతో ప్రజాకంటక తీఠును ప్రదర్శించిన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రతిపక్షాలు ఏకమై ఆవిర్భవించిన ప్రజాకూటమితోనే తాము ఎన్నికల్లో ముందుకు సాగనున్నట్లు తేల్చిచెప్పారు. తమకు పట్టున్న ప్రాంతాల్లో మాత్రమే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నామని, రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపోటములు నిర్ధారించే స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. కూటమి ఏర్పాటుతో టీఆర్‌ఎస్ ఓటమి ఖాయమైన నేపథ్యంలో విచ్ఛిన్నం చేసేందుకు ఆపార్టీ అనేక కుట్రలు, కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు. సీట్ల కేటాయింపు, సర్ధుబాట్లపై వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని కొట్టిపారేశారు. తాము డిమాండ్ చేసిన సీట్లపై చర్చలు కొనసాగుతున్నట్లుతెలిపారు. జిల్లాలో తమకు ఆయువుపట్టైన హుస్నాబాద్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నామని, పొత్తులో భాగంగా కూటమి నుంచి టికెట్ తమకే లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నట్లు పేర్కొన్నారు. కూటమి అధికారంలోకొస్తే మొదటగా రెవెన్యూ చట్టాల్లో సమూల మార్పులు చేసేందుకు నిర్ణయించామన్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫారసులు అమలు చేయనున్నట్లు చెప్పారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అవినీతి, అక్రమాలకు ఊతమిస్తున్నాయని, ఇందులో భాగమే సీబీఐ కి కూడా అవినీతి చీడ పట్టుకుందన్నారు. బేటీ పడావో..బేటీ బచావో కాదు...అనాథ శరణాలయాల్లో సైతం అత్యాచారాలు పెరుగుతున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీబీఐ డీఎస్పీ లంచాల బాగోతంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కరీంనగర్, జగిత్యాల జిల్లా కార్యదర్శులు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, బోయిని అశోక్, నాయకులు కేదారి, అందె స్వామి, శోభారాణి, రాజారెడ్డి, సమ్మయ్య, మణికంఠరెడ్డి పాల్గొన్నారు.