తెలంగాణ

బాబుతో పొత్తా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 24: అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందకుండా కుట్రపూరిత పాలన సాగించిన ఎపీ చంద్రబాబు నేడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా అడుగడుగున అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని, అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడంలో ఉన్న ఆంతర్యమేమిటని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం స్థానిక టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోసహా అనేక ప్రాజెక్టుల నిర్మాణం పనులను ఆపాలని కోరుతూ ఎపీ సీఏం చంద్రబాబునాయుడు అనేక మార్లు లేఖలు రాశారని ఆరోపించారు. శాసనసభకు జరిగే ముందస్తు ఎన్నికలలో తెలంగాణకు బద్దవ్యతిరేకైన చంద్రబాబుతో కాంగ్రెస్ నేతలు ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను బలవంతంగా చంద్రబాబు ఏపీలో చేర్చుకున్న దానిపై కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. హైకోర్టును విభజించకుండా కుట్రలు చేస్తున్న చంద్రబాబుతో ఎలా పొత్తు పెట్టుకుంటారని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయాలన్నారు.
కృష్ణబేసిన్‌లో ఉన్న పాలమూరు జిల్లాకు నీరు అందించకుండా పోతిరెడ్డిపాడు, పులిచింతల, పోలవరం ప్రాజెక్టులను కడుతూ తెలంగాణకు అన్యాయం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ పదవులకోసం కిమ్మనకుండా కూర్చున్నారని, ఆ నేతలే మళ్లీ ఆంధ్ర నాయకులకు వంతపలుకుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కంటే ఆంధ్ర పాలకులే నయమని చెప్పిన పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బే షరత్తుగా తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి, తన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ మాటలను ప్రతి తెలంగాణ వాది గర్హిస్తున్నారని అన్నారు. కృష్ణా, గోదావరి జలాలను తెలంగాణకు దక్కకుండా కుట్ర చేస్తున్న ఆంధ్ర నాయకులతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కవుతున్నారనే విషయాన్ని ప్రజలు గ్రహించారని, రానున్న రోజులలో వారికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. తెలంగాణలో అక్రమంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు వారి ప్రాంతానికి వెళ్లితే ఈ ప్రాంతానికి చెందిన ఉద్యోగులకు పదోన్నతులు దక్కడంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడేందుకు టీఆర్‌ఎస్ పాటుపడుతుంటే కాంగ్రెస్ నాయకులు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేఎల్‌ఐ ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు 25 టీఎంసీలు నీటి వాడకాన్ని 40 టీఎంసీలుగా పెంచడం జరిగిందని, దానికి అనుగుణంగా నీరు అందిస్తామన్నారు. చంద్రబాబు ఎన్నికుట్రలు చేసిన భగ్నం చేసి తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతామన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..నాగర్‌కర్నూల్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు