తెలంగాణ

వనదుర్గామాత హుండీ ఆదాయం రూ. 22 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, అక్టోబర్ 24: మెదక్ జిల్లా శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానిమాత అమ్మవారి 80 రోజుల హుండీ ఆదాయం రూ.21 లక్షల 74 వేల 844 లభించింది. బుధవారం ఏడుపాయల్లోని అమ్మవారి హుండీని గోఖుల్ షెడ్‌లో ఆలయ కమిటీ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, మెదక్ జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, ఆలయ ఈఓ మోహన్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తలు, సత్యసాయి సేవా సమితి సభ్యులు హుండీని లెక్కించారు. 80 రోజుల అమ్మవారి హుండీ ఆదాయం రూ.21.74 లక్షలు వచ్చింది. ఈ హుండీ లెక్కింపులో ఆలయ కమిటి చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, సూపరిండెంట్ శ్రీనివాసమూర్తి, ఈఓ మోహన్‌రెడ్డి, ఆలయ ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది, మెదక్ పట్టణ సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

చిత్రం..ఏడుపాయల్లో అమ్మవారి హుండీని లెక్కిస్తున్న దృశ్యం