తెలంగాణ

బీసీలకు 60 సీట్లిచ్చే దమ్ముందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, అక్టోబర్ 24: రాష్ట్రంలో బీసీలకు 60సీట్లు ఇచ్చే దమ్ము ఏ రాజకీయ పార్టీకి ఉందో ముందుకు వచ్చి ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బీఎల్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. జిల్లా కేంద్రంలోని సీతారామ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం నిర్వహించిన సీపీఎం నియోజకవర్గస్ధాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జనాభాలో అధికశాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు తగిన గుర్తింపు నివ్వడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలమయ్యాయన్నారు. అందువల్లే సామాజిక న్యాయమే ఎజెండాగా సీపీఎం కలిసి వచ్చిన శక్తులతో ఏకమై బీఎల్‌ఎఫ్‌ను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. 93శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అధికారం దక్కకుండా అగ్రకులాలకు చెందిన కొందరు నాయకులు మాత్రమే అధికారాన్ని అనుభవిస్తున్నారన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లలో అన్ని కులాలకు సమన్యాయం చేయలేకపోయినా, రెండు నెలల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనైనా అందరికీ న్యాయం చేయాలన్నారు. బీఎల్‌ఎఫ్ వచ్చే పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 14 వేల పంచాయతీల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. సమాజంలో ఉన్న అన్ని కులాలకు సమన్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. సర్పంచ్ నుండి సీఎం స్థాయి వరకు అన్ని కులాలకు ప్రాతినిథ్యం కల్పించేలా చూస్తామన్నారు. ఇప్పటివరకు అసెంబ్లీకాదు కదా నామినేషన్‌లు కూడా వేయని కులాలు చాలా ఉన్నాయన్నారు. పేదల బతుకులు మార్చేందుకే బీఎల్‌ఎఫ్ ఏర్పాటైనట్లు తెలిపారు. ఇప్పటికే తాము 56 మంది అభ్యర్థులను ప్రకటించామని, వీరిలో 32మంది బీసీలకు, రెండు స్థానాలను మాత్రమే అగ్రకులాల వారికి కేటాయించినట్లు వివరించారు. బీఎల్‌ఎఫ్‌కు ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్ దుష్ట పాలనకు ఎదురునిలిచి పోరాడింది సీపీఎం మాత్రమేనన్నారు. సామాజిక న్యాయం కోసం లాల్, నీల్ జెండాలు ఏకమైనట్లు తెలిపారు. వైద్య, విద్య, ఉద్యోగం అన్నింటిలో సామాజిక న్యాయమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. సమావేశంలో బీఎల్‌ఎఫ్ అభ్యర్థి రాపర్తి శ్రీనివాస్‌గౌడ్, సామాజిక ఉద్యమనేత సాంబశివరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి ముల్కలపల్లి రాములు తదితరులు ఉన్నారు.