తెలంగాణ

కాంగ్రెస్ ఆశావహులకు తప్పని ఎదురుతెన్నులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ ఆశావహులకు ఎదురుతెన్నులు తప్పడం లేదు. నవంబర్ మొదటి వారంలో అభ్యర్థులను ఖరారు చేయాలని అధిష్ఠానం నిర్ణయించడం వారిని ఉసూరుమనిపిస్తోంది. అసలే అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ప్రతిసారి ఎన్నికల్లో అనుకూల ఫలితాలు అందించే ప్రాంతంగా ఉన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల ఎంపిక విషయమై ఎడతెగని జాప్యం జరుగుతుండడం ప్రధాన ప్రతిపక్ష పార్టీ శ్రేణుల్లో ఒకింత నైరాశ్యం నెలకొనేలా చేస్తోంది. గత 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తెరాస అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందగా, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రస్తుతం తిరిగి వారికే అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. దీంతో గడిచిన నెల రోజులుగా తమతమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ దాదాపుగా తొలిదఫా ప్రచార పర్వాన్ని పూర్తి చేశారు. వీరికి మద్దతుగా కేసీఆర్ సైతం మలివిడత ఎన్నికల ప్రచారాన్ని నిజామాబాద్ జిల్లా నుండే శ్రీకారం చుడుతూ గులాబీ శ్రేణుల్లో జోష్ నింపారు. రెండు రోజుల క్రితం అభ్యర్థులతో నిర్వహించిన భేటీలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని అధినేత చేసిన సూచనల మేరకు తెరాస అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింతగా పదునెక్కించారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండడంతో ప్రచార పర్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆశావహులు తటపటాయిస్తున్నారు. ముందస్తుగానే తాము ప్రచార బరిలోకి దిగి పైకం విదిల్చుకుంటే, ఆ తరువాత తమకు అభ్యర్థిత్వం దక్కుతుందో లేదోననే సంశయంతో పలువురు మిన్నకుండిపోతున్నారు. కేవలం ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం కొనసాగుతోంది. మిగతా చోట్ల అభ్యర్థిత్వాలు ఎవరికి దక్కుతాయనే దానిపై స్పష్టత కొరవడడంతో ఆశావహులు ప్రచార బరిలోకి దుమికేందుకు వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో నలుగురు చొప్పున, జుక్కల్, నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్‌లలో ముగ్గురేసి నాయకులు అభ్యర్థిత్వాల వేటలో ఎవరికివారు తమవంతు లాబీయింగ్ యత్నాల్లో నిమగ్నమై ఉన్నారు.