తెలంగాణ

‘కోడ్’ నీడన భీం వర్ధంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,అక్టోబర్ 24: నిజాం నిరంకుశత్వాన్ని ఎదురొడ్డి పోరాడి అసువులు బాసిన మన్యం వీరుడు, ఆదివాసీల ఆరాధ్యదైవం కుమురంభీం 78వ వర్ధంతి సంధర్భంగా బుధవారం జోడెఘాట్‌లో సంప్రదాయ పూజలతో ఆదివాసీలు ఘనంగా నివాళులర్పించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో ఐటీడీఏ అధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన భీం వర్ధంతి కార్యక్రమం ఈసారి నిరాడంబరంగా సాగింది. కుమురంభీం స్వస్థలమైన ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లా కెరమెరి మండలం జోడెఘాట్‌కు వేలాది మంది ఆదివాసీలు, భీం వంశీయులు తరలిరావడంతో అటవీ ప్రాంతం జనారణ్యాన్ని తలపించింది. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం కుమురంభీం కుటుంబ సభ్యులు ముందుగా భీం సమాది వద్ద అవ్వల్‌పేన్, పెర్సపేన్ పూజలు నిర్వహించి తమ జెండాను ఆవిష్కరించారు. కుమురంభీం మనువడు సోనెరావు తన కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రద్దాంజలి ఘటించారు. నిజాం పాలకులను ఎదిరించి ఆదివాసీల హక్కులు, స్వేచ్చా స్వాతంత్రాల కోసం పోరాడి అమరుడైన భీం ఆశయాలను కొనసాగిస్తామని ఆదివాసీలు ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఎస్పీ మల్లారెడ్డి, ఐటిడి ఏ పివో కృష్ణ ఆదిత్య భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దర్బార్ కోసం ఆనవాయితీగా వేదిక ఏర్పాటు చేసినప్పటికీ కోడ్ నేపథ్యంలో వేదిక ఎక్కకుండానే అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి వివిధ ప్రాంతాల నుండి ఆదివాసీ గిరిజన బిడ్డలు వేలాది సంఖ్యలో తరలిరావడంతో జోడెఘాట్ పరిసర ప్రాంతాలు జనసందోహంతో కిటకిటలాడాయి. ఆసిఫాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఎంపి గెడం నగేష్, ఐటిడి ఏ చైర్మెన్ కనక లక్కెరావు, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు జోడెఘాట్ భీం వర్ధంతికి హాజరై నివాళులర్పించారు.
ఆదివాసీ చట్టాల అమలులో సర్కారు విఫలం : కోదండరాం
అడవులనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆదివాసీల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం విషయంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. బుధవారం జోడెఘాట్‌లోని కుమురంభీం సమాది వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ భూములకు హక్కులు కల్పించి, కుమురంభీం ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు మాట్లాడుతూ ఎన్నికల అనంతరం ఆదివాసీలు కుమురంభీం పోరాట స్పూర్తితో మిలటరీ ఉద్యమాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల బతుకులు ఇప్పటికీ అస్తవ్యస్తంగానే ఉన్నాయని, జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసీలంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.