తెలంగాణ

అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లాదుర్గం, అక్టోబర్ 24: ప్రధాని నరేంద్రమోదీ 29 రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారే తప్ప ఎలాంటి అప్పు చేయలేదని అందోల్ బీజేపీ అభ్యర్థి బాబుమోహన్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా అల్లాదుర్గంలో రేణుకామాత ఆలయ ప్రాంగణంలో ఎనిమిది మండలాల బీజేపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని అయి ఉండి దేశాభివృద్ధికి కృషి చేశారే తప్పా అప్పులు తీసుకురాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేశారని ఆయన విమర్శించారు. రాష్ట్ర అభివృద్ది జరగకున్నా అప్పులు మాత్రం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. నేను ఎమ్మెల్యేగా పనిచేశానని, రాష్ట్రంలో అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇచ్చి తనకు నిరాకరించడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఇలాంటి సీఎం ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేశారో ప్రజలకు కూడా అర్థం కావడం లేదన్నారు. మిషన్ భగీరథ తదతర వాటిపై మధ్యంతరంలో పనులు ఆపి ఎన్నికలు ఎందుకు పెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం అభివృద్ది జరగదన్నారు. బీజేపీ ఈనెల 20న అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటించిందన్నారు. బీజేపీలో అన్నింటిలో ముందుంటుందన్నారు. బూత్, గ్రామ కమిటీలు పకడ్బందీగా ప్రకటించారని, వారంతా ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. బీజేపీని అప్పట్లో ఎన్టీరామారావు ఇష్టపడ్డారని తెలిపారు. తెలంగాణను బీజేపీ పాలించబోతోందని తెలిపారు. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజయ్యకు ఎస్సీ అని తొలగించి అన్యాయం చేశారన్నారు. ఇదే పరిస్థితిలో పార్టీలోని ఎస్సీలకు జరుగుతుందన్నారు. ప్రజలు ఈసారి బీజేపీకి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ హయంలోనే అన్ని రాష్ట్రాలు అభివృద్ది చెందుతాయన్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. బీజేపీ పార్లమెంటరీ కన్వీనర్ ప్రభాకర్‌గౌడ్, జిల్లా కార్యదర్శి కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న అందోల్ బీజేపీ అభ్యర్థి బాబుమోహన్