తెలంగాణ

రాష్ట్రాన్ని తాకట్టుపెట్టేందుకు కాంగ్రెస్ యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 24: తెలంగాణ రాష్ట్రాన్ని అటు అంధ్రకు, ఇటు ఢిల్లీకి తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మహాకూటమిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం జిల్లా కేంద్రమైన నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మర్రి యువగర్జన రోడ్‌షోను నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్‌లో జరిగిన రోడ్‌షో సభలో ఆయన మాట్లాడుతూ వలసవాద నేతల మోచేతి నీళ్లకు అలవాటుపడ్డ తెలంగాణ నేతలు మరోమారు తెలంగాణపై వలసవాద నేతల పెత్తనాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలలో గెలువలేమనే భయంతోనే కాంగ్రెస్ నేతలు చంద్రబాబు భజన చేసేందుకు ఆరాటపడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెసోళ్లు చంద్రబాబును నమ్ముకుంటే, టీఆర్‌ఎస్ ప్రజలను నమ్ముకుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన టీఆర్‌ఎస్‌కు ప్రజలనుంచి అపూర్వమైన స్పందన వస్తుందన్నారు. పాలమూరు జిల్లానుంచి వలస పోయిన ప్రజలు ఈ నాలుగున్నర ఏళ్ల పాలనలో తిరిగి సొంతగూటికి చేరుకుంటున్నారని అన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం వలస వెళ్లిన పాలకులను భుజాన ఎత్తుకొని మళ్లీ తెలంగాణలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అభివృద్ధి సాధకులు, నిరోధకుల మధ్య జరుగుతున్నాయని, ప్రజలు ఎటువైపో తేల్చుకోవాలన్నారు. పాలమూరు జిల్లా పచ్చబడాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కడుతుంటే కాంగ్రెస్ నాయకులు పనిగట్టుకొని కోర్టులకు వెళ్లి అపేందుకు ప్రయత్నిస్తున్నారని, ముఖ్యంగా స్థానిక నాయకులు నాగం జనార్ధన్‌రెడ్డి హైకోర్టులో పలు కేసులు వేశారని ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లు అధికారంలో ఉండి వుంటే పదేళ్లైన కేఎల్‌ఐ ద్వారా నీరు ఇచ్చేవారు కాదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లనే కేఎల్‌ఐ ప్రారంభించి గతేడాది 26 టీఎంసీల నీటిని పాలమూరుకు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం కేఎల్‌ఐ ద్వారా నీటిని అందిస్తుంటే చంద్రబాబు దానిని ఆపేందుకు కుట్ర చేస్తూ కేంద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. ఈ ప్రాంతానికి న్యాయంగా దక్కాల్సిన నీటిని దక్కకుండా రాయలసీమకు తరలిస్తుంటే ఈ ప్రాంతానికి చెందిన నేతలు వంత పాడారేగాని ఆపేందుకు ప్రయత్నించలేదనే, ఆ నేతలు నేడు మళ్లీ కృష్ణా, గోదావరి నీళ్లు మనకు దక్కకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైకాపా, టీడీపీలను తెలంగాణ ద్రోహులని ప్రకటించిన కోదండరాం అదే టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను అమలుచేస్తునే అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న టీఆర్‌ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. వచ్చే ఎన్నికలలో మర్రి జనార్దన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా మళ్లీ గెలిపించాలని ఆయన కోరారు.
చిత్రం.. నాగర్‌కర్నూల్‌లో జరిగిన రోడ్‌షో సభలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు