తెలంగాణ

సీబీఐ డైరక్టర్‌గా ఓరుగల్లు ముద్దుబిడ్డ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, అక్టోబర్ 24: మండలంలోని బోరునర్సాపురంకు చెందిన మనె్నం నాగేశ్వరరావుకు అరుదైన అవకాశం లభించింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకం అయిన సీబీఐ డైరక్టర్‌గా మనె్నం నాగేశ్వరరావు నియమితులయ్యారు. భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం బోరునర్సాపురంకు చెందిన మనె్నం నాగేశ్వరరావు అంచెలంచెలుగా ఎదిగి నేడు సీబీఐ పీఠాన్ని అధిష్టించారు. బోరునర్సాపురంకి చెందిన మనె్నం శేషమ్మ - మనె్నం పిచ్చయ్య దంపతుల పెద్ద కుమారుడైన మనె్నం నాగేశ్వరరావువిద్యాభ్యాసం 1 నుంచి 7వ తరగతి వరకు మంగపేట యూపీఎస్‌లోనూ, 8 నుండి 10 వరకు తిమ్మంపేట జడ్పీ పాఠశాలలోనూ జరిగింది. ఇంటర్మీడియట్ వరంగల్‌లోని ఏవీవీ జూనియర్ కళాశాలలోనూ, వరంగల్ సీకేఎం కాలేజ్‌లో డిగ్రీ పీజీ చేశారు. 1986లో పీజీ చేస్తున్న సమయంలోనే సివిల్స్ రాసి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. 1986లో ఒరిస్సా క్యాడర్ ఐపీఎస్‌గా ఎంపికైన నాగేశ్వరరావు ఎక్కువ కాలం చత్తీస్‌ఘడ్‌లోనే పని చేశారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల జాయింట్ డైరక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మనె్నం నాగేశ్వరావును సీబీఐ డైరక్టర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మండలానికి చెందిన మనె్నం నాగేశ్వరరావు సీబీఐ డైరక్టర్‌గా నియమితులు కావడంపై మనె్నం నాగేశ్వరరావు క్లాస్ మేట్స్, స్నేహితులు, బంధువులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం..మనె్నం నాగేశ్వరరావు