తెలంగాణ

ఆహారోత్పత్తికి తెలంగాణ సహకారం తీసుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: తమ దేశంలో ఆహోరోత్పత్తిని పెంచేందుకు తెలంగాణ సహకారం తీసుకుంటామని సీ షెల్స్ దేశం వ్యవసాయ మంత్రి చార్లెస్ బాస్టెన్ పేర్కొన్నారు. మూడురోజుల పాటు తెలంగాణలో వ్యవసాయ పంటలను పరిశీలించేందుకు బాస్టేన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం హైదరాబాద్ వచ్చింది. బుధవారం ఈ కమిటీ సభ్యులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి సచివాలయంలో సమావేశమయ్యారు. వ్యవసాయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి జోషి ఈ సందర్భంగా వివరించారు. బాస్టేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ దేశానికి చెందిన రైతులను తెలంగాణకు అధ్యయనం కోసం పంపిస్తామన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి, వ్యవసాయ కమిషనర్ రాహుల్ బొజ్జా, ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీదేవీ తదతరులు ఉన్నారు.
చిత్రం..సీ షెల్స్ దేశం ప్రతినిధులతో తెలంగాణ చీఫ్ సెక్రటరీ సమావేశమైన దృశ్యం