తెలంగాణ

టిక్కెట్టు రాని వారు బాధ పడవద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్టు రాని నాయకులు బాధపడరాదని, త్యాగాలకు సిద్ధం కావాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా కోరారు. ప్రజాకూటమి ఏర్పాటు కావడం అనివార్యమైనందున కొన్ని సీట్లు మిత్రపక్షాలకు ఇవ్వాల్సి వస్తున్నదని ఆయన తెలిపారు. బుధవారం గాంధీ భవన్‌లో టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్‌సీ కుంతియా ప్రసంగిస్తూ ముందస్తు ఎన్నికల్లో పొత్తులతో ముందుకెళుతున్నామని అన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించిన వారికి నిరాశ కలుగుతుంది వాస్తవమేనని, అయితే అటువంటి వారు త్యాగాలకు సిద్ధపడాలని ఆయన తెలిపారు. ఆ త్యాగాలకు గుర్తింపు ఉంటుందని, అధికారంలోకి రాగానే వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి ప్రాధాన్యతనిస్తామన్నారు. టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ టిక్కెట్ వచ్చినా, రాకపోయినా అందరమూ ఐక్యమత్యంతో పని చేయాలని కోరారు. ఈ నెల 31న ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేయాలని కోరారు. నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. 45 రోజులు పార్టీ కోసం, సైనికుడిలా పని చేయాలని ఆయన కోరారు. ఈ నెల 28న అధికార ప్రతినిధుల వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం నాలుగు టీంలుగా ప్రచారం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని, సోనియా గాంధీనీ ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇంకా ఈ సమావేశంలో సీఎల్‌పి మాజీ నేత కే. జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.